SRH vs RCB Final | 2016 IPL Final Repeat |SRHకు పాత బాకీలు తీరుస్తామంటున్న RCB| ABP Desam
SRH vs RCB Final | 2016 IPL Final Repeat | ఆదివారం రాత్రి కేకేఆర్ , ఆర్ఆర్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో SRH పాయింట్స్ టేబుల్ లో టాప్-2కు దూసుకెళ్లింది. దీనిపై SRH ఫ్యాన్స్ కంటే RCB ఫ్యాన్సే ఎక్కువ హ్యాపీగా ఫీలవుతున్నారు. ఎందుకంటే.. SRHతో RCB కి పెద్ద వైరమే ఉంది. 2016 సీజన్ లో ఫైనల్ లో హైదరాబాద్, బెంగళూరు మధ్య జరిగింది. అప్పుడు హైదరాబాద్ గెలిచింది. అంతేకాదు.. 2009లోనూ ఫైనల్ హైదరాబాద్, బెంగళూరు మధ్య జరిగింది. అప్పుడూ హైదరాబాదే గెలిచింది. దీంతో.. ఈ సారి ఫైనల్ లో SRHపై గెలిచి కప్ గెలవడంతో పాటు హైదరాబాద్ పాత బాకీలు క్లియర్ చేయాల్సిన సమయం ఆసన్నమైందని RCB ఫ్యాన్స్ లెక్కలు వేసుకుంటున్నారు. ఇది జరగాలంటే క్వాలిఫైయర్స్ -1 SRH ఆడాలి. క్వాలిఫైయర్స్ -2 ఆర్సీబీ ఆడాలి. క్వాలిఫైయర్స్ -1లో కేకేఆర్ పై ఎస్ఆర్హెచ్ గెలిచి ఫైనల్ కు వెళ్లాలి. ఆర్ఆర్ తో జరిగే ఎలిమినేటర్స్ మ్యాచులో ఆర్సీబీ గెలవాలి. అలాగే..క్వాలిఫైయర్స్ -2లో కేకేఆర్ పై ఆర్సీబీ గెలిచి ఫైనల్ లో అడుగుపెట్టాలి. ఇదే కనుక జరిగితే మే 26న SRH vs ఆర్సీబీ మధ్య మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. దీంతో..2016 సీన్ రిపీట్ అవుతుంది.. ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ అంటూ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. మరి మీరేమంటారు ఈ థియరీపై..!