Shreyas Iyer RCB vs PBKS IPL 2025 Final | శ్రేయస్ స్ట్రాటజీస్ ఏంటని వణికిపోతున్న RCB
నందమూరి బాలకృష్ణ చెన్నకేశవ రెడ్డి సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. ఓ మనిషిని బతికించేది గాలి, నీరు, నిద్ర, అన్నం, ఆకలే కాదు పగ..పగ కూడా బతికిస్తుంది అని. అచ్చం అలాంటి పగతోనే ఐదేళ్లుగా రగిలిపోతున్నాడు పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. అసలు గడిచిన ఐదేళ్ల కాలంలో శ్రేయస్ అయ్యర్ స్థాయిలో జట్టును నాయకత్వంతో ఫలితాలు అందిస్తున్న వాడు మరొకడు లేడు. 2019లో ఢిల్లీని కెప్టెన్ గా ప్లే ఆఫ్స్ కి తీసువెళ్లిన అయ్యర్..2020 లో ఏకంగా ఫైనల్ ఆడించాడు. తర్వాత ఢిల్లీ నుంచి కోల్ కతా కు మారి అక్కడ గతేడాది కెప్టెన్ గా బాధ్యతలు తీసుకుని ఏకంగా 11ఏళ్ల తర్వాత కేకేఆర్ ను ఛాంపియన్ గా నిలబెట్టాడు. కానీ కేకేఆర్ ను అయ్యర్ ను రిటైన్ చేసుకోవటానికి ఇష్టపడకపోవటంతో ఈ సారి పంజాబ్ కు కెప్టెన్ గా మారి ఈ జట్టును కూడా 11ఏళ్ల తర్వాత ఫైనల్ కి తీసుకువెళ్లాడు. ఇప్పుడు పంజాబ్ కప్పు కానీ కొట్టిందా. కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ ఎన్నో వందల నోళ్లకు సమధానం చెప్పినవాడు అవుతాడు. అటు టీమిండియాలో తనకు చోటు ఇవ్వని వారికి, ఇటు తనను వద్దనుకున్న ఐపీఎల్ జట్లకు మాడు పగిలిపోయేలా ఆన్సర్ ఇచ్చిన వాడు అవుతాడు. తనెంతలా రాణిస్తూ అటు పరుగుల వరద పారిస్తూ ఇటు నాయకుడిగా తన జట్లకు అత్యుత్తమ ఫలితాలు అందిస్తున్నా తన విషయంలో ఎదురవుతున్న నిర్లక్ష్యం మీద పగతో రగిలిపోతున్న అయ్యర్ ఈ రోజు ఆర్సీబీపై జరిగే ఫైనల్ కచ్చితంగా విరుచుకపడిపోతాడని అభిమానులు భావిస్తున్నారు. క్వాలిఫైయర్ 2 మ్యాచ్ లో ముంబై పై అయ్యర్ ఆడిన తీరు ఆ విధానం చూస్తుంటే ఆ జోరు ఆర్సీబీ పైనా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి శ్రేయస్ ఏం చేస్తాడో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.





















