Rohit Sharma Fastest Half Century IPL 2026 | ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ సాధించిన రోహిత్ | ABP Desam
ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభంలోనే ముంబై ఇండియన్స్ అద్భుతం చేసింది. వాంఖడే స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి, ఒకేరోజు రెండు భారీ రికార్డులను తిరగరాసింది.
మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ వింటేజ్ మోడ్‌లోకి వెళ్ళిపోయాడు. కేవలం 23 బంతుల్లోనే అర్ధసెంచరీని పూర్తి చేసి, తన ఐపీఎల్ కెరీర్‌లోనే అత్యంత వేగవంతమైన ఫిఫ్టీని నమోదు చేశాడు. 2015లో సిఎస్‌కేపై చేసిన 25 బంతుల ఫిఫ్టీ రికార్డును చెరిపేసాడు. మొత్తం 38 బంతుల్లో 78 పరుగులు చేసి కేకేఆర్ బౌలర్లను ఉతికి ఆరేశాడు.
2012 తర్వాత ముంబై ఇండియన్స్ సీజన్ తొలి మ్యాచ్ నెగ్గడం ఇదే మొదటిసారి. అంతేకాకుండా, 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ముంబైకి ఇదే అత్యధిక రన్ ఛేజింగ్ కావడం విశేషం. రోహిత్‌తో కలిసి ఓపెనర్ రయాన్ రికెల్టన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 43 బంతుల్లోనే 81 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 148 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించడంతో కేకేఆర్ నిర్దేశించిన 220 పరుగుల భారీ లక్ష్యం కూడా చిన్నది అయింది.
ట్రెండింగ్ వార్తలు





















