Riyan Parag 6 Sixers vs KKR IPL 2025 | కేకేఆర్ బౌలర్లపై 6 సిక్సర్లతో విరుచుకుపడిన రియాన్ పరాగ్ | ABP
రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ నుంచే ఎప్పుడో ఎలిమినేట్ అయిపోయింది. కానీ తమ బలాబలాలను పరీక్షించుకోవటం..రిజర్వ్ బెంచ్ స్టామినాను టెస్ట్ చేసుకోవటంతో పాటు ప్రత్యర్థులకు షాక్ ఇచ్చే ప్రయత్నాలను బలంగా చేస్తోంది RR. నిన్న కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ అలాంటిదే. చావు తప్పి కన్ను లొట్టబోయినందన్నట్లు ఓడిపోవాల్సిన మ్యాచ్ ను కేకేఆర్ తృటిలో 1పరుగు తేడాతో కాపాడుకోగలిగింది. అయితే రాజస్థాన్ కెప్టెన్ రియాగ్ పరాగ్ మాత్రం నిన్న అద్భుతమే చేశాడు. క్రికెట్ లో రేర్ ఫీట్ అని పిలుచుకునే ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లను నిన్న చేసి చూపించాడు పరాగ్. కేకేఆర్ విసిరిన 207పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసే క్రమంలో...ఇన్నింగ్స్ 13వ ఓవర్ ను కేకేఆర్ బౌలర్ మొయిన్ అలీ వేస్తే పరాగ్ అతనిపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు. అలీ బౌలింగ్ లో ఐదు బంతులను ఎదుర్కొన్న పరాగ్ ఐదింటినీ భారీ సిక్సర్లుగా మలిచి మొత్తంగా ఆ ఓవర్ లో 32పరుగులు రాబట్టాడు. ఆ తర్వాతి ఓవర్లో వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో తను ఎదుర్కొన్న మొదటి బంతినే సిక్సర్ గా మలిచిన రియాన్ పరాగ్...మొత్తంగా ఆరు వరుస బంతుల్లో ఆరు సిక్సర్లు బాది...18ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి బ్యాటర్ గా చరిత్ర సృష్టించాడు. 45 బాల్స్ లో 6 ఫోర్లు 8 సిక్సర్లతో 95పరుగులు చేసి అవుటయ్యాడు పరాగ్. చివర్లో శుభమ్ దూబే కూడా మెరుపులు మెరిపించటంతో మ్యాచ్ రాజస్థాన్ గెలిచేది కానీ చివరి బంతికి ఒక్క పరుగు తేడాతో బతికి బయటపడి ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా నిలుపుకుంది. కానీ పరాగ్ సిక్సర్ల వర్షం మాత్రం ఐపీఎల్ రికార్డుల్లోకి ఎక్కింది.





















