MS Dhoni Clarity on IPL Retirement | తన రిటైర్మెంట్ వార్తలపై క్లారిటీ ఇచ్చేసిన MS ధోనీ
కెప్టెన్ గా చెన్నై సూపర్ కింగ్స్ కి 5 కప్పులు అందించిన మహేంద్ర సింగ్ ధోనీ..నిన్న కెప్టెన్ గా తన లాస్ట్ మ్యాచ్ ఆడేశాడు. రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కి గాయం కారణంగా సీజన్ నుంచి దూరం అవ్వటంతో సీజన్ మధ్యలో కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న ధోనీ..ఈ సారి జట్టును విన్నింగ్ ట్రాక్ ఎక్కించలేకపోయాడు. కానీ సీజన్ మధ్య నుంచి చెన్నై ఈసారి కొత్త వాళ్లకు టీమ్ లో అవకాశాలు ఇచ్చింది. ఆయుష్ మాత్రే, షేక్ రషీద్, అన్షుల్ కాంభోజ్, ఉర్విల్ పటేల్ అంటూ చాలా మంది యంగ్ ప్లేయర్స్ ఈ సారి సీఎస్కే తరపున ఆడాలన్న తమ కలను తీర్చుకున్నారు. యంగ్ స్టర్స్ ను ఇంతలా అవకాశాలు ఇస్తున్నాడంటే ఈ సారి సీజన్ తర్వాత ధోనీ ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తాడనే ప్రచారం జోరుగా సాగింది. ఇప్పటికే 44ఏళ్ల వయస్సులో ఉన్న ధోనీ ఫిట్నెస్ పరంగా గాయాలతో ఇబ్బందులు పడుతున్నా అలాగే బండి లాగిస్తున్నాడు. నిన్న గుజరాత్ పై కెప్టెన్ గా తన ఆఖరు మ్యాచ్ ఆడిన ధోనీ చివరి మ్యాచ్ లో చెన్నైను విజయపథంలో నడిపించాడు. సీజన్ ను విక్టరీతో ముగించిన సందర్భంగా మాట్లాడిన మాహీ తన రిటైర్మెంట్ ఆలోచనలకు ఇంకా 4-5 నెలల సమయం ఉందని క్లారిటీ ఇచ్చేశాడు. తను వచ్చే సీజన్ ఆడాలి అంటే ఫిట్ గా ఉండటం అవసరం ఉన్న ధోనీ...తనలో టైమింగ్ ఇంకా పోలేదని కానీ నాలుగైదు నెలలు గడిస్తేనే కానీ తను ఏం చెప్పలేని పరిస్థితి ఎప్పట్లానే ఉంటుందన్నాడు. రెండు నెలల సుదీర్ఘ సీజన్ కారణంగా ఇంటిని మిస్సయ్యానన్న ధోనీ రాంచీకి వెళ్లి బైక్ డ్రైవ్స్ కి వెళ్లాలని తన కోరికను వెల్లిబుచ్చాడు. తన దగ్గరున్న చాలా టైమ్ ఉండటంతో బాగా ఆలోచించుకుని సమాధానం చెబుతానని..తన సీన్ అయిపోయిందని చెప్పట్లేదని అలా అని నెక్ట్స్ సీజన్ కచ్చితంగా వస్తానని కూడా చెప్పలేనన్నాడు. తనకు అవకాశం ఉంది కాబట్టి ఆలోచించుకుని చెప్తానంటూ క్లారిటీ అయితే ఇచ్చేశాడు. వెళ్తూ వెళ్తూ ఇంకో మాట కూడా ఉన్నాడు. చాలా మంది ప్రదర్శనల గురించి మాట్లాడుతూ ఉంటారు. ఫర్ ఫార్మెన్స్ చూసుకుని రిటైర్మెంట్ ఇచ్చేయాలి అంటే చాలా మంది 22ఏళ్లకే రిటైర్మెంట్ ఇచ్చేయాలంటూ తన హేటర్స్ కి గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు మాహీ. చూడాలి మరి 45ఏళ్ల వయస్సులో ఐపీఎల్ ఆడిన అత్యంత పెద్ద వయస్కుడిగా మళ్లీ తిరిగి వస్తాడో లేదా 18 ఏళ్ల ఐపీఎల్ కెరీర్ లో ఐదుసార్లు టీమ్ ను ఛాంపియన్ గా నిలిపిన నాయకుడిగా ఐపీఎల్ నుంచి సైలెంట్ గా ధోనీ నిష్క్రమిస్తాడో.





















