Mitchell Starc Bowlings vs SRH | KKR vs SRH Qualifier 1 Highlights | చావుదెబ్బ కొట్టిన స్టార్క్
Mitchell Starc Bowlings vs SRH | KKR vs SRH Qualifier 1 Highlights | క్వాలిఫైయర్ 1లో కేకేఆర్ చేతిలో SRH ఎవరి వల్ల ఓడిపోయిందో తెలుసా...! మిచెల్ స్టార్క్..! యస్.. ఈ ఆరు అడుగుల స్పీడ్ గన్ వల్లే హైదరాబాద్ ఓడిపోయింది. మిచెల్ స్టార్క్ కోసం కేకేఆర్ మేనేజ్మెంట్ 24 కోట్లకుపైగా పెట్టి కొనుక్కుంది. కానీ, అతడు ఈ ఐపీఎల్ లో పెద్దగా ఆడింది ఏమి లేదు. ముంబయితో జరిగిన మ్యాచులో 4 వికెట్లు తీశాడు తప్పా...స్థాయికి తగ్గట్లు ఏ రోజు ఆడలేదు. కేకేఆర్ ఫ్యాన్స్ అంతా పైసలు దండుగా అనుకున్నారు. కానీ, కీలకమైన క్వాలిఫైయర్స్ లో మాత్రం పైసా వసూల్ అన్నట్లుగా చెలరేగిపోయాడు. పవర్ ప్లేలోనే 3 ఓవర్లు వేసిన స్టార్క్..కేవలం 22 పరుగులు ఇచ్చి కీలకమైన 3 వికెట్లు తీసుకున్నాడు. ఇన్నింగ్స్ 2వ బాల్ కే ట్రావెస్ హెడ్ ను బౌల్డ్ చేయడం మొత్తం మ్యాచ్ కే హైలైట్ అని చెప్పుకోవాలి. ఆ తరువాత నితీశ్ రెడ్డి , షాబాద్ అహ్మద్ ల వికెట్లు తీసుకున్నాడు. SRHకు బలమే పవర్ ప్లే..! పవర్ ప్లేలోనే సుమారు 100 పరుగులు చేస్తే... మిగతా 14 ఓవర్లలో ఒత్తిడి లేకుండా ఆడుకోవచ్చు. ఇదే కెప్టెన్ కమిన్స్ గేమ్ ప్లాన్. కానీ, ఆ ఆస్ట్రేలియన్ బుర్ర ఏంటో తెలిసిన స్టార్క్... పవర్ ప్లేలోనే 3 వికెట్లు తీసుకుని SRHను చావుదెబ్బ కొట్టాడు. అలా... ఇన్నాళ్లు ఫామ్ లో లేనట్లు కనిపించిన స్టార్క్... కీలకమైన మ్యాచులో ఫామ్ లోకి రావడం...మరి ముఖ్యంగా టీ20 వరల్డ్ కప్ ముంద డెంజర్ బెల్స్ మోగించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.