LSG vs RCB Match Jitesh Sharma 85 IPL 2025 | ఆర్సీబీకి తిరుగులేని విక్టరీని అందించిన జితేశ్ శర్మ
228 పరుగుల భారీ లక్ష్యం. కళ్ల ముందు 12 ఓవర్లలో 123 పరుగులు కొట్టినా నాలుగు వికెట్లు పడిపోయి ఉన్నాయి. విరాట్ కొహ్లీ సహా ఆర్సీబీ ప్రధాన బ్యాటర్లంతా అప్పటికే పెవిలియన్ కి చేరిపోయి ఉన్నారు. అలాంటి టైమ్ లో నాన్ స్ట్రైక్ ఎండ్ లో మయాంక్ అగర్వాల్ ను నిలబెట్టుకుని 8ఓవర్లలో పెను విధ్వంసమే చేసి 100కు పైగా పరుగులు బాది ఆర్సీబీకి దిమ్మ తిరిగే విక్టరీ అందించాడు కీపర్ బ్యాటర్ జితేశ్ శర్మ. కెరీర్ లో 53 ఐపీఎల్ మ్యాచ్ లు ఆడినా ఎప్పుడూ సాధ్యపడని హాఫ్ సెంచరీ మార్క్ ను అందుకోవటంతో పాటు కెప్టెన్ గానూ వ్యవహరించి తన జట్టుకు ఊహించని విజయాన్ని అందించి క్వాలిఫైయర్ 1 కి టాప్ 2 జట్టుగా పట్టుకెళ్లాడు ఈ మహారాష్ట్ర బ్యాటర్. క్వాలిఫైయర్ 1 కి వెళ్లాలంటే ఆర్సీబికి గెలుపు తప్పనిసరి అని భావించిన మ్యాచ్ లో ఎప్పుడో ఎలిమినేట్ అయిపోయిన లక్నో సూపర్ జెయింట్స్ హోరా హోరీగా తలపడింది. మార్ క్రమ్ ప్లేస్ లో బ్రీత్ జ్కే కి అవకాశం ఇచ్చినా తను వెంటనే వికెట్ సమర్పించేసుకున్నా కెప్టెన్ రిషభ్ పంత్ వన్ డౌన్ లో వచ్చి మరో ఓపెనర్ మిచ్ మార్ష్ తో దుమ్ము రేపాడు. ముఖ్యంగా స్పైడీ పంత్ తన 27కోట్ల రూపాయల ఆక్షన్ కు సరైన న్యాయం ఏంటో ఫైనల్ మ్యాచ్ లో చూపించాడు. 61 బాల్స్ లో 11 ఫోర్లు 8 సిక్సర్లతో 118పరుగులు చేసిన పంత్ సెంచరీ అభివాదం చేసి తెగ సంబరపడిపోయాడు. పంత్ కి తోడు మార్ష్ కూడా 37 బాల్స్ లో 4 ఫోర్లు 5 సిక్సర్లతో 67పరుగులు చేయటంతో లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227పరుగులు చేయగలిగింది. 228 టార్గెట్ తో బరిలోకి దిగిన ఆర్సీబీకి కొండంత అండలా నిలబడ్డాడు కింగ్ విరాట్ కొహ్లీ. మరో ఓపెనర్ సాల్ట్ 30 పరుగులు చేస్తే కింగ్ కొహ్లీ 30 బాల్స్ ఆడి 10 ఫోర్లతో 54 పరుగులు చేసి ఔటయ్యాడు. అప్పుడు మొదలైంది జితేశ్ శర్మ విధ్వంసం. పటీదార్ 14, లివింగ్ స్టన్ డకౌట్ అయినా మయాంక్ అగర్వాల్ 41 పరుగులతో అండగా నిలబడటంతో కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన జితేశ్ 33 బాల్స్ లో 8 ఫోర్లు 6 సిక్సర్లతో 85 పరుగులు చేసి సిక్సర్ తో 228 పరుగుల టార్గెట్ ను 18.4 ఓవర్లలోనే ఫినిష్ చేసి ఆర్సీబికి 6 వికెట్ల తేడాతో విక్టరీతో పాటు టాప్ 2 జట్టుగా క్వాలిఫైయర్ 1 ఆడే అవకాశాన్ని ఇచ్చి అద్భుతమే చేశాడు. ఆర్సీబీ చరిత్రలోనే ఇది హయ్యెస్ట్ ఛేజింగ్ చేసిన మ్యాచ్. ఇక 29 వ తారీఖు క్వాలిఫైయర్ 1 లో పంజాబ్ తో ఆర్సీబీ తనలపడనుండగా 30 వ తారీఖు ఎలిమినేటర్ మ్యాచ్ లో ముంబైని గుజరాత్ ఢీ కొట్టనుంది.





















