Gautam Gambhir Sunil Narine Celebrations | IPL 2024 కైవసం చేసుకున్నాక గౌతీ, నరైన్ సెలబ్రేషన్స్ | ABP
మాడు మొహం వేసుకుని కూర్చుంటారు. అసలు నవ్వనే నవ్వరు. ఇదే ఈ సీజన్ లో గౌతం గంభీర్, సునీల్ నరైన్ టార్గెట్ గా వచ్చిన కామెంట్స్. ఈ విషయం నేరుగా గంభీర్ నే అడిగాడు రవిచంద్రన్ అశ్విన్ తన కుట్టీ స్టోరీస్ ఇంటర్వ్యూలో. దానికి గంభీర్ చెప్పిన సమాధానం స్టేడియానికి ఆడియెన్స్ వచ్చేది KKR గెలిస్తే చూడాలని నేను నవ్వితే ఆనందించాలని కాదు. మేం మ్యాచ్ గెలిస్తే నేను నవ్వినా నవ్వకున్నా ఒకటే. నేనేం సినిమా యాక్టర్ ని కాదు. కమెడియన్ అంత కంటే కాదు అన్నాడు. ఇది హార్ష్ గా నే ఉన్నా గంభీర్ చెప్పిందే వందకు వందశాతం కరెక్ట్. గంభీర్ కి పీఆర్ స్టంట్స్ చేయటం రాదు. ఫ్యాన్స్ కి కావాల్సిన మసాలా అందించే కంటెంట్ ప్రొవైడర్ కాదు. కప్పు గెలవాలి. తను కేకేఆర్ తిరిగి వచ్చినప్పుడు పెట్టిన పోస్ట్ ఇది. అలాంటోడు నిన్న నరైన్ తో కలిసి పెద్దగా నవ్వాడు ఎందుకంటే





















