India vs Pakistan Shake Hand Controversy | వరల్డ్ కప్‌లోనూ ‘నో హ్యాండ్‌షేక్’
ఆసియా కప్‌లో ( Asia Cup 2025 ) టీమ్ ఇండియా ప్లేయర్స్ పాకిస్తాన్ ప్లేయర్స్ కు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం అనేది పెద్ద ఇష్యూగా మారింది. ఇప్పుడు అదే సీన్ మరోసారి రిపీట్ అయింది. విమెన్ టీమ్స్ మధ్య జరుగుతున్న వరల్డ్ కప్ మ్యాచ్ లో ఇండియా పాకిస్తాన్ కెప్టెన్స్ షేక్‌హ్యాండ్ చేసుకోలేదు. టాస్ టైంలో పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా (Fatima Sana)కు హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) షేక్‌హ్యాండ్ ఇవ్వలేదు. ఫాతిమాను పట్టించుకోలేదు కూడా. టాస్ ముగిసిన తర్వాత రిఫరీతో మాట్లాడి వెళ్లిపోయింది హర్మన్‌ప్రీత్ కౌర్.
అయితే ఈ మ్యాచ్ లో ఇంకో సంఘటన చోటు చేసుకుంది. టాస్ జరిగినప్పుడు పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమ ముందు టెయిల్స్ అని చెప్పింది. కానీ రిఫరీ షాంద్రే ఫ్రిట్జ్, అనౌన్సర్ మెల్ జోన్స్ మాత్రం ఆమె హెడ్స్ చెప్పింది అని అనుకున్నారు. హెడ్స్ పడగానే ఫాతిమా టాస్ గెలిచిందని రిఫరీ చెప్పింది. ఇండియా హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా ఎం చెప్పకుండా పక్కకు వెళ్ళిపోయింది. ఈ సంఘటన చూసిన వారు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.




















