India vs England 3rd Test Day 1 Highlights | సెంచరీకి ఒక్క పరుగు దూరంలో జో రూట్
టెస్టు క్రికెట్‌లో బజ్ బాల్ అంటూ ప్రతి సారి దూకుడు ప్రదర్శించే ఇంగ్లాండ్ డే 1 ఆటలో మాత్రం పూర్తి భినంగా ఆడింది. వికెట్లను కాపాడుకోవడానికి ఇంగ్లాండ్ బ్యాట్సమెన్ పూర్తి క్లాస్ గేమ్ ను ఆడారు అని అంటున్నారు క్రికెట్ నిపుణులు. వికెట్ కోల్పోకుండా... మెల్లగా రన్స్ చేయడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు.
లార్డ్స్ లో ప్రారంభమైన రెండవ టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్. అయితే తోలి రెండు టెస్టులో టీం ఇండియా టాస్ ఓడిపోయింది. అలాగే మూడవ టెస్ట్ లో కూడా మరోసారి టాస్ ఓడిపోయింది. మొదటి రెండు టెస్టుల్లో టాస్ గెలిచి, ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్, ఈ సారి మాత్రం బ్యాటింగ్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించాడు.
తొలి రోజు ఆట ముగిసే సమయానికి 83 ఓవర్లు బ్యాటింగ్ చేసి, 4 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది ఇంగ్లాండ్ టీం. ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ 99 పరుగులు చేసి సెంచరీకి ఒక్క పరుగు దూరంలో ఉన్నాడు. అలాగే కెప్టెన్ బెన్ స్టోక్స్ 39 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. ఓపెనర్లుగా క్రీజ్ లోకి వచ్చిన జాక్ క్రాలే, బెన్ డకెట్ ను నితీశ్ కుమార్ రెడ్డి ఒకే ఓవర్‌లో పెవిలియన్ చేర్చాడు. జడేజా బౌలింగ్‌లో ఓల్లీ పోప్ అవుట్ అవగా హ్యారీ బ్రూక్ ను బుమ్రా క్లీన్ బౌల్డ్ చేసాడు. అయితే ఈ మ్యాచ్ లో జో రూట్ ఒక అరుదయిన రికార్డుని బ్రేక్ చేసాడు. టీమిండియాపై టెస్టుల్లో 3 వేల పరుగులు పూర్తి చేసుకున్న మొట్టమొదటి ఇంగ్లాండ్ బ్యాటర్‌గా జో రూట్ నిలిచాడు.



















