DC Release Rishabh Pant IPL 2025 Retention | పోరాట యోధుడిని వదిలేసుకున్న ఢిల్లీ | ABP Desam
రూమర్స్ అన్నీ నిజం అయ్యాయి. పోరాట యోధుడు పంత్ ని వదిలేసుకుంది ఢిల్లీ క్యాపిటల్స్. ఐపీఎల్ రిటెన్షన్ ను జాబితాను ప్రకటించింది ఢిల్లీ. కేవలం నలుగురు ప్లేయర్లనే రిటైన్ చేసుకుంది. బౌలింగ్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ కు తొలి ప్రాధాన్యతనిచ్చిన ఢిల్లీ ఏకంగా పదహారున్నర కోట్లు పెట్టి అతడిని అట్టిపెట్టుకుంది. చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ను కావాలనుకుంది. కుల్దీప్ కోసం 13కోట్ల 25లక్షలు పెట్టింది. వీళ్లిద్దరూ కాకుండా ట్రిస్టన్ స్టబ్స్ ని 10 కోట్ల రూపాయలకు, అన్ క్యాప్డ్ ప్లేయర్ క్యాటగిరీలో నాలుగు కోట్లు ఇచ్చి అభిషేక్ పోరెల్ ను అట్టిపెట్టుకుంది ఢిల్లీ క్యాపిటల్స్. మరి రిషబ్ పంత్ తనకు ఇష్టమైన ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి ఎందుకు బయటకు వచ్చాడు. ముందు నుంచి ఊహాగానాలు వస్తున్నట్లు చెన్నై సూపర్ కింగ్స్ పంత్ ను ఆక్షన్ లో కొనుక్కోవాలనుకుంటోందా.? చూడాలి సీఎస్కే నే కొనుక్కుంటే ధోని కి ఫ్యూచర్ బ్యాకప్ గా కీపర్ బ్యాటర్ గా అవసరమైతే కెప్టెన్ గా కూడా రిషభ్ పంత్ ఉపయోగపడతాడు మరి చూడాలి స్పైడీని ఎవరు తీసుకుంటున్నారో అసలు పంత్ బాబు ప్లాన్ ఏంటో.