అన్వేషించండి
ఇంద్రకీలాద్రి పై నటరాజ స్వామి వారి కళ్యాణం...
నటరాజస్వామి ఆలయంలో ఆర్ద్రోత్సవ కళ్యాణోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం, సాయంత్రం మూల మంత్రం హవనములు, బలిహరణ, ఔపాసన, మంటపపూజలను రుత్వికులు నిర్వహించారు. రాత్రి శ్రీ శివకామ సుందరీ సమేత నటరాజ స్వామి వారి దివ్య కళ్యాణోత్సవాన్ని ప్రధాన అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ఆరుద్ర నక్షత్రం, శివ ముక్కోటి పర్వదినాన్ని పురస్కరించుకొని నటరాజస్వామి ఆర్డరోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో ఆలయ ఈవో డి.భ్రమరాంబ , నటరాజ స్వామి ఆలయ వ్యవస్థాపకుల కుటుంబ సభ్యులు, ఆలయ ఉన్నతాధికారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
వ్యూ మోర్





















