Nepal Crisis Hint for India | భారత్ చుట్టూ సంక్షోభాలతో అల్లకల్లోలం.. టార్గెట్ ఇండియానేనా? | ABP
మయన్మార్‌లో సివిల్ వార్, శ్రీలంకలో ఎకనామిక్ క్రైసిస్... భయంకరమైన అల్లర్లతో అట్టుడికిన బంగ్లాదేశ్... ఇప్పుడు నేపాల్‌లో కూడా సరిగ్గా అదే అల్లకల్లోలం. అసలు ఆసియాలో ఏం జరుగుతోంది? అది కూడా కేవలం ఇండియా బోర్డర్స్‌లోనే ఇదంతా ఎందుకు జరుగుతోంది? ఇన్నాళ్లూ ప్రశాంతంగా ఉన్న దేశాల్లో ఇప్పుడు ఉన్నట్లుండి ఇలాంటి దారుణ పరిస్థితులు ఎందుకు తలెత్తతున్నాయి? ఇది ఇండియాకి కూడా వేక్ అప్ కాల్ లాంటిదేనా..?
హాయ్.. అండ్ వెల్‌కమ్ టూ ఇండియా మాటర్స్. మన పొరుగు దేశాలన్నీ ఒక దాని తర్వాత ఒకటిగా దారుణమైన సంక్షోభాలని ఎదుర్కొంటున్నాయి. అయితే దక్షిణాసియాలో నెలకొన్న ఈ పరిస్థితిపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ దేశాల్లో అస్థిరత వెనుక చాలా డీప్ రీజన్స్ ఉన్నాయని కొంతమంది ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. ఈ అలజడుల వెనుక యూఎస్, చైనా లాంటి చాలా పెద్ద పెద్ద దేశాలే ఉన్నాయంటున్నారు. అసలు వారి మెయిన్ టార్గెట్ ఇండియా అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇలా అనిపించడానికి రీసెంట్‌గా శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ సంక్షోభాలే పెద్ద ఎగ్జాంపుల్. ఈ దేశాల్లో పరిస్థితులు పరిశీలిస్తే.. చాలా సింపుల్‌గా అంతా ఎవరో వెనకనుంచి నడిపించినట్లు అనిపిస్తుంది. అకస్మాత్తుగా గవర్నమెంట్ తీసుకున్న ఓ డెసిషన్‌కి వ్యతిరేకంగానో, లేదంటే ఏదైనా సమస్యకి వ్యతిరేకంగానో ఒకచోట నిరసనలు మొదలవడం.. వాటిని ఆపడానికి గవర్నమెంట్ ట్రై చేయడంతో కొంతమంది ప్రాణాలు పోగొట్టుకోవడం.. సడెన్‌గా నిరసనలు హింసాత్మకంగా మారి దేశ వ్యాప్తంగా విస్తరించడం.. ఆ తర్వాత నిరసనకారులు విజృంభించి ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తూ.. రాజకీయ నేతల భవనాలు కూల్చేస్తూ.. నిప్పుపెట్టి తగలబెడుతూ.. ప్రభుత్వ భవనాలని దోచుకుంటూ తిరగడం.. అలాంటి టైంలో సడెన్‌గా ఓ ఫేస్ తెరమీదకొచ్చి.. ఆపద్ధర్మ దేశాధినేతగా పగ్గాలు చేపట్టడం.. లేదా అధికార మార్పిడి జరగడం.. ఇదే ఈ దేశాలన్నింటిలో జరిగింది.
ఇలా ఈ దేశాన్నింటిలో కామన్ సిట్యుయేషన్ కనిపించడంతోనే ఈ మొత్తం ఘటనల వెనక యూఎస్, చైనా లాంటి పెద్ద దేశాలున్నాయంటున్నారు కొంతమంది జియోపొలిటికల్ ఎక్స్‌పర్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్.. దక్షిణాసియాలో పవర్ కోసం అమెరికా ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. కానీ ఈ ప్రాంతంలో ఆల్రెడీ అమెరికాకి కౌంటర్ పార్ట్‌గా ఎదిగిన చైనా.. అమెరికాని వెనక్కి తోసి.. ఈ ప్రాంతం మొత్తాన్ని తన ఆధీనంలో పెట్టుకోవాలని అనుకుంటోంది. ఇక్కడే అసలు సమస్య వస్తోంది. ఈ రెండు దేశాల కన్ను ఏ దేశంపై పడితే ఆ దేశం అట్టుడికిపోతోంది. దానికి పెద్ద ఉదాహరణ మయన్మార్ సంక్షోభం. మయన్మార్‌లో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆంగ్ సాన్ సూకీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెకి అమెరికా ఫుల్ సపోర్ట్ ఇచ్చింది. ప్రజాస్వామ్య విలువలకు ఐకాన్‌గా సూకీని అమెరికా చెప్పుకొచ్చింది. 2020లో సూకీ ఆధ్వర్యంలోని నేషనల్ లీగ్ ఫర్ డమోక్రసీ పార్టీ భారీ విజయం సాధించి అధికారంలోకి వచ్చిన తర్వాత.. సూకీ సర్కార్ కూడా ప్రో అమెరికన్ గవర్నమెంట్‌లానే పనిచేసింది. అయితే చైనాకి, ఆర్మీకి అనుకూలంగా ఉండే యూనియన్ సాలిడారిటీ అండ్ డెవలప్‌మెంట్ పార్టీ ఈ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడం చైనాకి నచ్చలేదు. దీంతో చైనా వెనుక నుంచి పావులు కదిపింది. చైనా సపోర్ట్‌తో 2021 ఫిబ్రవరిలో సూకీతో పాటు అధికార పార్టీ నేతలందరినీ అరెస్టు చేసిన ఆ దేశ మిలిటరీ.. దేశ పగ్గాలు తన చేతుల్లోకి తీసుకుంది. మిలిటరీ చేతుల్లో ఉన్న మయన్మార్‌కి ఇప్పుడు చైనా ఫుల్ సపోర్ట్ ఇస్తోంది. అయితే ఈ ఆర్మీతో పోరాడుతున్న ప్రజాస్వామ్య అనుకూల సాయుధ బలగాలకు అమెరికా ఆర్థికంగా, రాజకీయంగా మద్దతు ఇస్తోంది. దీనికోసమే బంగ్లాదేశ్‌లోని ఓ దీవి కావాలని అమెరికా అనుకుంది. దానికి బంగ్లాదేశ్ ఒప్పుకోకపోవడంతోనే అక్కడ అమెరికా సంక్షోభం సృష్టించిందనేది విశ్లేషకుల మాట.
మయన్మార్ సంక్షోభానికి.. బంగ్లాదేశ్‌ని అమెరికా ఎందుకు టార్గెట్ చేసిందో తెలియాలంటే.. ముందు బంగ్లాదేశ్‌లో ఏం జరిగిందో చూద్దాం. బంగ్లాదేశ్‌లో అధికారంలో ఉన్న హసీనా గవర్నమెంట్ స్వాతంత్ర్య సమరయోధుల వారసులకు జాబ్ కోటా ఇవ్వాలని డిసైడ్ అయింది. దీనిపై విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు స్టార్ట్ చేశారు. ఆ నిరసనలు కాస్తా దేశం మొత్తం వ్యాపించి అల్లకల్లోలం సృష్టించాయి. ఈ సిట్యుయేషన్స్‌లోనే 2024లో ఆ దేశ ప్రధాని షేక్ హసీనా దేశం నుంచి పారిపోయి భారత్‌కు రావాల్సి వచ్చింది. అయితే దీనివెనక కంప్లీట్‌గా అమెరికా హస్తం ఉందని షేక్ హసీనా సైతం ఓపెన్‌గానే ఆరోపణలు చేశారు. ఆమె చెబుతున్న దాని ప్రకారం.. సెయింట్ మార్టిన్ ద్వీపంలో అమెరికా మిలిటరీ బేస్‌కు అనుమతి ఇవ్వకపోవడం వల్లే.. తనను అమెరికా టార్గెట్ చేసి తమ దేశాన్ని నాశనం చేసిందని ఆరోపించారామె. ఇది మాత్రమే కాదు.. ఈ తిరుగుబాటు జరగడానికి ముందు కొన్నేళ్ల నుంచి బంగ్లాదేశ్ చైనాకి దగ్గరవుతూ వెళ్తోంది. ఇది అమెరికాకి ఏ మాత్రం నచ్చలేదు. దానికి తోడు.. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు మయన్మార్‌లో చైనాని కౌంటర్ చేయడానికి అమెరికాకి సెయింట్ మార్టిన్ ద్వీపంలో సైనిక స్థావరం ఏర్పాటు చేయడం చాలా అవసరం. దాని వల్ల కూడా ఈ విషయంలో బంగ్లాదేశ్‌ని అమెరికా బాగా ప్రెజర్ చేసింది. బట్.. చైనా సపోర్ట్ ఉండటం వల్ల.. హసీనా అందుకు ఒప్పుకోలేదు. దాని ఫలితంగానే దేశ మొత్తం అల్లక్లోలం సృష్టించిందనేది కొంతమంది విశ్లేషకుల మాట.
ఇక శ్రీలంకదీ దాదాపు ఇలాంటి సిట్యుయేషనే. చైనా, అమెరికా కోల్డ్ వార్‌కి సింహళ ద్వీపం బలైపోయిందంటారు చాలామంది ఎక్స్‌పర్ట్స్. మనందరికీ చూడ్డానికి.. కృత్రిమ ఎరువుల నిషేధంతో శ్రీలంక వ్యాప్తంగా ఆహార కొరత ఏర్పడి నిరసనలు మొదలయ్యాయి అనిపిస్తుంది. కానీ.. దీనివెనక అమెరికా సీఐఏ కుట్ర దాగుందనేది కొంతమంది మాట. 2020 కోవిడ్‌కి ముందు నుంచే శ్రీలంక ఇండియాని కూడా కాదని.. చైనాకి బాగా దగ్గరవడం స్టార్ట్ చేసింది. అందులో భాగంగానే హంబన్‌టోట పోర్టును 99 ఏళ్లకు చైనాకి లీజుకిచ్చింది. కానీ హిందూమహాసముద్రంలో కీలక దేశంగా ఉన్న శ్రీలంక చైనాకి దగ్గర కావడం అమెరికాకి ఏ మాత్రం నచ్చలేదు. దాంతో శ్రీలంకలోని అమెరికా సపోర్టింగ్ అపోజిషన్ పార్టీకి సపోర్ట్ ఇచ్చి.. గవర్నమెంట్‌పై బాగా ప్రెజర్ పెంచడం స్టార్ట్ చేసింది. అదే టైంలో కోవిడ్ దెబ్బతో టూరిజం పడిపోవడం కూడా శ్రీలంక ప్రభుత్వాన్ని బలహీన పర్చింది. ఒకపక్క అమెరికా సపోర్టింగ్ అపోజిషన్ నుంచి వచ్చే ప్రెజర్.. ఇంకో పక్క దిగజారుతున్న ఆర్థిక స్థితి.. వీటన్నింటి నుంచి బయటపడటంతో పాటు గవర్నమెంట్‌ని కాపాడుకోవాలనే టెన్షన్‌లో గోటబాయ రాజపక్స గవర్నమెంట్ కృత్రిమ ఎరువులని నిషేధించే తప్పుడు నిర్ణయం తీసుకుంది. ఆ దెబ్బతో శ్రీలంక జుట్టు అమెరికా చేతుల్లోకి వెళ్లిపోయింది. దేశంలో ఆహారం, విద్యుత్, మందులు, ఇంధన కొరతతో ప్రజలు రోడ్లపైకి దిగి నిరసనలు మొదలుపెట్టడంతో.. వాటికి అమెరికా వెనుక నుంచి పుష్ ఇచ్చింది. అంతే దేశం అట్టుడికిపోయింది. రాజపక్స దేశం వదిలి పారిపోవడంతో.. రణిల్ విక్రమసింఘె ఆపద్ధర్మ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. అధికారం అమెరికా అనుకూల ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లిపోయింది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా ప్రాబల్యాన్ని కౌంటర్ చేయడానికి అమెరికా అనుకూల శక్తులే శ్రీలంకలో ఈ ఆర్థిక సంక్షోభాన్ని, అల్లకల్లోలాన్ని సృష్టించి.. అధికార మార్పిడి చేయించిందని విశ్వేషకులు ఇప్పటికీ ఆరోపిస్తుంటారు. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ (IMF) లాంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలపై కూడా అగ్రరాజ్యాలకు పట్టు ఉండటంతో.. ఈ సంస్థలు విధించే షరతులు, రుణ విధానాలు కొన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతాయనడంలో సందేహం లేదు. శ్రీలంక సంక్షోభం సమయంలో ఈ సంస్థలు విధించిన కఠినమైన షరతులే ఆ దేశాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టాయి. ప్రజల కష్టాలను మరింత పెంచాయి.
ఇక ఇప్పుడు నేపాల్‌లోనూ అదే పరిస్థితి. ఇక్కడి ఉద్రిక్త పరిస్థితుల వెనుక కూడా అమెరికా హస్తం ఉందని అక్కడి మీడియా బహిరంగంగానే విమర్శిస్తోంది. గత కొన్నేళ్లుగా నేపాల్‌లో అమెరికా భారీగా పెట్టుబడులు పెడుతోంది. కానీ ప్రస్తుతం అక్కడ అధికారంలో ఉన్న ప్రధాని కేపీ ఓలీ చాలా వరకు చైనాకి అనుకూలంగా పనిచేస్తున్నారు. అందులో భాగంగానే అమెరికన్ యాప్స్‌ని బ్యాన్ చేస్తూ ూల్ తెచ్చాడు. దీంతో అమెరికాకి సంబంధించిన అనేక ప్రాజెక్టులకు సడెన్ బ్రేకులు పడ్డాయి. వేల కోట్ల నష్టం ఏర్పడింది. అందుకే ఆయనకు వ్యతిరేకంగా అమెరికా డీప్‌స్టేట్, సీఐఏ అనుకూల శక్తులు.. ఈ సంక్షోభానికి తెరలేపాయనేది నేపాల్ మీడియా మాట.
ఈ రకంగా ఈ దేశాలన్నింటిలో రాజకీయ సంక్షోభం తలెత్తడం.. అధికార మార్పిడి జరిగడం.. చైనానో లేదంటే, అమెరికానో ఎవరో ఒకరి చేతుల్లోకి దేశం వెళ్లిపోవడం.. ఆ దేశానికి సపోర్ట్ చేసే వ్యక్తులు ప్రభుత్వాధినేతలుగా బాధ్యతలు చేపట్టడం.. ప్రతి చోటా మనకి కనిపిస్తూనే వస్తోంది. అయితే ఇప్పుడు ఇండియన్ ఎక్స్‌పర్ట్స్ భయపడుతున్న విషయం ఏంటంటే.. ప్రస్తుతం అల్లకల్లోలం అవుతున్న దేశాలన్నీ ఇండియా బోర్డర్ని ఆనుకునే ఉన్నాయి. దీంతో ఇదంతా ఇండియాకి పెద్ద త్రెట్‌గా మారే ప్రమాదం లేకపోలేదు. దానికి తోడు.. అన్నింటికంటే ముఖ్యంగా.. అసలు ఈ సంక్షోభాలన్నింటి మెయిన్ టార్గెట్ ఇండియానే అని కూడా కొంతమంది విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. అంతేకాదు.. ఆల్రెడీ ఇండియాలో ఇలాంటి ప్రయత్నాలు.. ఒకటి కాదు.. రెండు కాదు.. అనేకసార్లు జరిగాయని కూడా ప్రూఫ్‌లతో సహా చూపిస్తున్నారు.
భారత్‌ను కూడా అస్థిరపరచడనికి ఫారెన్ పవర్స్ ప్రయత్నించాయని భారతీయ విదేశీ వ్యవహారాల నిపుణులంటున్నారు. 2020-21లో 3 వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలతో దేశంలో మొదటి సారి అస్థిరత సృష్టించాలని ప్రయత్నం జరిగిందని.. రెండోసారి.. ఉత్తర్‌ప్రదేశ్‌లో షహీన్ బాగ్ అల్లర్లతో.. మూడోసారి 2024లో మణిపుర్ అల్లర్లతో ఈ ప్రయత్నాలు చేశాయని.. కానీ వీటిని భారత్ ధైర్యంగా ఎదుర్కోవడంతో ఫ్యూచర్లో ఇలాంటి ప్రయత్నాలు ఇంకా ఇంకా చేయబోతున్నాయని.. వాటన్నింటిని కూడా ఎదుర్కోవడానికి దేశం సిద్ధంగా ఉండాలని వార్న్ చేస్తున్నారు. బీజేపీ నేత సావియో రోడ్రిగ్స్ వంటి వాళ్లు కూడా.. నేపాల్‌లో నెలకొన్న సంక్షోభం కేవలం స్థానిక సమస్యల వల్ల కాదని.. ఇదంతా డీప్‌స్టేట్ లాంటి విదేశీ శక్తుల కుట్రలో భాగమని అంటున్నారు. సీఐఏ వంటి అమెరికా ప్రభావిత శక్తులు యువతను ప్రేరేపించి, సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వాలను అస్థిరపరుస్తున్నాయని ఆయన చేసిన ఆరోపణలు ఇప్పుడు అందరినీ టెన్షన్ పెడుతున్నాయి.
ఇండియాలో కూడా నిజంగానే పక్క దేశాల్లో అస్థిరత సృష్టించినట్లే విదేశీ శక్తులు అస్థిరత సృష్టించి.. దేశాన్ని అల్లకల్లోలం చేయడం.. ప్రభుత్వాన్ని పడదోయడంలో సక్సెక్ కాగలవా? అంటే అది అంత ఈజీ కాదు. దానికి కారణం మన దేశ కోర్ భావన అయిన భిన్నత్వంలో ఏకత్వమే. మన దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. 145 కోట్ల మంది ప్రజలకి నివాసం. వీళ్లలో ఎన్నో వర్గాల వాళ్లు, మతాల వాళ్లు, జాతుల వాళ్లు, కులాల వాళ్లు.. వృత్తుల వాళ్లు, వయస్సుల వాళ్లు ఉంటారు. నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, మయన్మార్‌లలో అంటే జనాభా తక్కువ కాబట్టి.. వెంటనే ప్రజలందరికీ ఏకం చేయడం విదేశీ శక్తులకి ఈజీ అయిపోయింది. కానీ.. ఇండియాలో అలా కాదు. ఇక్కడ అలాంటి ప్రయత్నం జరిగి కొన్ని లక్షల మంది రోడ్లమీదకొచ్చినా.. వాళ్లని వ్యతిరేకించే భావజాలాలు, దేశ హితం కోసం ఆలోచించే ఇంటల్లెక్చువల్స్.. వాళ్లని ఫాలో అయ్యే ఎడ్యుకేటెడ్ పీపుల్.. ఇలా కోట్లలో ఉంటారు. వాళ్లే దేశాన్ని కాపాడుతారు. మన దేశంలో ఏ భావజాలం కానీ, ఏ ఆలోచనా విధానం కూడా పూర్తిగా విస్తరించి లేదు. ప్రతి దానికి కౌంటర్ పార్ట్స్ ఉన్నాయి. అన్నింటికంటే ఎక్కువగా.. మన దేశంలో ఉన్న నిరుద్యోగ సమస్య, ఆర్థిక లోటు సామాన్య మధ్యతరగతి ప్రజల్ని ఉద్యోగాలు మానుకుని రోడ్ల మీద ధర్నాలు చేయనివ్వదు. వీటన్నింటి వల్ల విదేశీ శక్తుల ప్రభావంతో మన దేశంలో కూడా పొరుగు రాష్ట్రాల్లాంటి అస్థిరత ఏర్పడటం సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. కానీ దేశ వ్యాప్తంగా పెరుగుతున్న నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, రాజకీయ అవినీతి, ఎన్నికల విధానాలపై అనుమానాలు.. లాంటి సమస్యలన్నీ ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని పెంచుతున్నాయి. ఈ సమస్యలని వేగంగా పరిష్కరించుకోకపోతే దేశం మొత్తం కాకపోయినా.. అనేక రాష్ట్రాల్లో సంక్షోభాలని ఎదుర్కోవాల్సి రావచ్చు.
అయితే మన దేశంలో సంక్షోభం రాకపోయినా.. మన సరిహద్దు దేశాల్లో జరుగుతున్న ఈ అల్లర్లు, సంక్షోభాల వల్ల మాత్రం.. మన దేశం కచ్చితంగా సెక్యూరిటీ పరంగా, చొరబాట్ల పరంగా కొంత సమస్యని ఫేస్ చేసే ఛాన్స్ ఉంది. ఆ సమస్యలని మాత్రం మన ప్రభుత్వం దీటుగా ఎదుర్కోవాలి. మరి ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంటి? భారత్ చుట్టూ ఉన్న దేశాల్లో ఏర్పడుతున్న సంక్షోభాలపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి. వచ్చే వారం ఇంకో అద్భుతమైన వీడియోతో మీముందుకొస్తాను.. అప్పటివరకు జైహింద్.





















