Ukraine పై యుద్దానికి రష్యా అధ్యక్షుడు Vladimir Putin బాధ్యుడు : ICC | ABP Desam
ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై స్పందించింది. ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తున్నందున రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పై అరెస్ట్ వారెంట్ జారీ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్ పై యుద్దం, మారణకాండకు పుతిన్ ను బాధ్యుడ్ని చేస్తూ క్రిమినల్ కోర్టు శుక్రవారం రష్యా అధ్యక్షుడు పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
పిల్లలను చట్టవిరుద్ధంగా తరలించడం వంటి చర్యలకు పుతిన్ బాధ్యత వహించాల్సి ఉంటుందని అంతర్జాతీయ నేర న్యాయస్థానం ఒక ప్రకటనలో పేర్కొంది.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేయడం కేవలం ఆరంభం మాత్రమేనని ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం పేర్కొంది. త్వరలోనే తమకు న్యాయం జరుగుతుందని, రష్యాకు కోర్టులోనే శిక్ష పడుతుందని ఉక్రెయిన్ అధ్యక్షుడి ప్రధాన అధికారి ఆండ్రీ ఎర్మాక్ అన్నారు.
ఐసీసీ నిర్ణయాన్ని రష్యా అధికారులు తీవ్రంగా ఖండించారు. ICC తీసుకున్న ఏ నిర్ణయం చెల్లదు. రష్యా చట్టం ప్రకారం ఈ తీర్పుని మేం ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోవడం లేదు అని రష్యా స్పష్టం చేశారు.
ఈ నిర్ణయం సరైందేనని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. ఉక్రెయిన్‌కు మద్దతుగా ఉంటామనీ భరోసా ఇచ్చారు. ఇటీవలే కీవ్ వెళ్లిన బైడెన్ ఉక్రెయిన్ రాజధానిలో ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీతో సమావేశం అయ్యారు.