Valimai Cement: ట్రెండ్ ఫాలో అవుతూనే.. సెట్ చేస్తున్న తమిళనాడు సీఎం స్టాలిన్
తమిళనాడు సీఎం స్టాలిన్ మరోసారి తనదైన శైలిలో ఓ నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడు ప్రభుత్వం సబ్సిడీ లో అందించే సిమెంట్ లో వాలిమై పేరుతో కొత్త బ్రాండ్ ను విడుదల చేశారు. తమిళనాడు సిమెంట్స్ కార్పొరేషన్ లిమిటెడ్-టాన్సెమ్ ద్వారా ఒక సిమెంట్ బ్యాగ్ ను 350 నుంచి 365లకే అందించాలని భావిస్తోంది. సబ్సిడీ ధరల్లో నాణ్యమైన సిమెంట్ ను అందించటం ద్వారా మధ్యతరగతి, పేద ప్రజల సొంతింటి కలలను సాకారం చేయాలనే ఉద్దేశంతో తమిళనాడు ప్రభుత్వం సిమెంట్ ను సొంతంగా తయారు చేయించి విక్రయిస్తోంది. మొత్తం మూడు ప్లాంట్ల ద్వారా పదిహేడు లక్షల మెట్రిక్ టన్నుల సిమెంట్ ను ఏడాదికి తయారు చేస్తున్నారు. అరసు పేరుతో ఇప్పటికే నాణ్యమైన సిమెంట్ ను విక్రయిస్తోన్న స్టాలిన్ సర్కారు...ఇప్పుడు వాలిమై పేరుతో మరో బ్రాండ్ ను విడుదల చేసింది.





















