అన్వేషించండి

Iran vs Israel: టెహ్రాన్‌పై దాడికి నేనే ఆదేశించా.. ఇరాన్ అణుశక్తిగా మారకుండా అడ్డుకుంటాం: ట్రంప్

Donald Trump | ఇరాన్ అణుశక్తిగా మారకుండా నిరోధించడానికి తాము దాడులు మొదలుపెట్టామని, ఇదే బెస్ట్ ఆప్షన్ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. మరికొన్ని రోజులు దాడులు తప్పవన్నారు.

Iran US-Israel War: ఇరాన్ సుప్రీం లీడర్‌షిప్‌ను అంతం చేశామంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇరాన్ అణు అభివృద్ధి, బాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రామ్‌ను అడ్డుకోవడానికే తాను ఇరాన్‌పై దాడికి ఆదేశాలిచ్చానని స్పష్టం చేశారు. ఇరాన్‌ను అణుశక్తి దేశంగా ఎప్పటికీ మారనివ్వబోమని, ఆ దేశం వేగంగా ఆ దిశగా అడుగులు వేస్తోందని ట్రంప్ అన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ సైన్యం ఇరాన్ ఆటలు కట్టిస్తుందని, వారిని పూర్తి స్థాయిలో అడ్డుకునే వరకు దాడులు కొనసాగుతాయని తెలిపారు.

ఈ క్రమంలో అమెరికా అధినేత ట్రంప్ రెండు వీడియోలను విడుదల చేశారు. వీటిలో ఇరాన్ అణుశక్తి దిశగా వేస్తున్న అడుగులు, తీసుకుంటున్న చర్యల గురించి ఆయన మాట్లాడారు. వార్తా సంస్థ రాయిటర్స్ ప్రకారం, ఇరాన్ నుండి ముప్పు పొంచి ఉందని, అందుకే వారిని అడ్డుకునేందుకు దాడులు చేయాల్సి వచ్చిందని ట్రంప్ తెలిపారు. అయితే, దీనికి సంబంధించి ఆయన ఎటువంటి ఆధారాలను ఆయన వెల్లడించలేదు.

దాడి చేయడమే మాకున్న బెస్ట్ ఆప్షన్ - ట్రంప్

ఇరాన్‌పై దాడి చేయడం మాకున్న చివరి, అత్యుత్తమ అవకాశం అని ట్రంప్ తన ప్రకటనలో పేర్కొన్నారు. ‘ఇరాన్ లోని ప్రమాదకరమైన ప్రభుత్వం నుంచి ఎదురయ్యే ముప్పులను అంతం చేయడమే మా లక్ష్యం. అమెరికా చేపట్టిన ఈ దాడి 4 నుంచి 5 వారాల వరకు కొనసాగుతుందని అంచనా వేశాము. ఇంకా ఎక్కువ కాలం కూడా దాడులు కొనసాగవచ్చు. ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేయకుండా అడ్డుకోవడమే ఈ యుద్ధం టార్గెట్. అయితే ఇరాన్ దీనిని పలుమార్లు తోసిపుచ్చింది. అలాగే సుదూర లక్ష్యాలను ఛేదించే బాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రామ్‌ను విఫలం చేయడం మా లక్ష్యం. లాంగ్ రేంజ్ మిస్సైల్స్, అణ్వాయుధాలతో కూడిన ఇరాన్ ప్రభుత్వం మిడిల్ ఈస్ట్‌కు, అమెరికా ప్రజలకు పెద్ద ముప్పుగా మారుతుందని’ ట్రంప్ వ్యాఖ్యానించారు. 

 10 ఇరాన్ నౌకలను కూల్చివేశాం - ట్రంప్

అమెరికా సైన్యం 10 ఇరాన్ నౌకలను కూల్చివేసిందని, అవి సముద్రంలో మునిగిపోయాయని అధ్యక్షుడు ట్రంప్ తన ప్రకటనలో తెలిపారు. భయంకరమైన, ఉగ్రవాద పాలన నుండి అమెరికాకు ఎదురయ్యే ముప్పును తగ్గించడానికి తమ సైన్యం ఇరాన్‌లో భారీ స్థాయిలో పోరాటం చేస్తోందన్నారు. ఇరాన్ క్షిపణి సామర్థ్యాలను ధ్వంసం చేయడం, వారి నౌకాదళాన్ని అంతం చేయడంతో పాటు అణ్వాయుధాలను కలిగి ఉండకుండా అడ్డుకోవడమే అమెరికా ముఖ్య ఉద్దేశ్యమని, ఇందులో ఎలాంటి మార్పు లేదన్నారు.

ఇవే కాకుండా, ఇరాన్ మిలిటెంట్ గ్రూపులకు మద్దతు ఇవ్వకుండా అడ్డుకోవడం సైతం తమ లక్ష్యాల్లో ఒకటిగా ట్రంప్ పేర్కొన్నారు. ఈ పోరాటంలో నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారని ట్రంప్ ప్రస్తావించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
Donald Trump: అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
India Pakistan:
"భారత ఏజెంట్ పాకిస్థాన్‌లోకి ప్రవేశించి 30 మంది ఉగ్రవాదులను హతమార్చాడు"లష్కర్ కార్యకర్త సంచలన ప్రకటన!
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PV Sindhu Sports Academy Visakhapatnam: విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీకి రెండోసారి శంకుస్థాపన జరిగిందా? 
విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీకి రెండోసారి శంకుస్థాపన జరిగిందా?
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
Amritsar Police:జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
కలుషిత E20 ఇంధనంతో జాగ్రత్త! వెహికల్‌ ఓనర్లకు SIAM హెచ్చరిక - కేంద్రం కీలక ఆదేశాలు
E20 పెట్రోల్‌పై కొత్త ఆందోళన.. దెబ్బతింటున్న ఇంజిన్ పార్ట్స్, పెరుగుతున్న రిపేర్లు!
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
Donald Trump: అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
Embed widget