TATA AirIndia : అధికారికంగా పూర్తైన విలీన ప్రక్రియ....సొంతగూటికే ఎయిరిండియా
అధికారికంగా ప్రక్రియ పూర్తైంది. ఎయిరిండియా దశాబ్దాల తర్వాత పుట్టింటికి చేరుకుంది. స్వతంత్రపూర్వం టాటా ఎయిర్ లైన్స్ గా ఉన్న విమాన సేవలను జాతికి టాటాల వంశం అంకితమివ్వగా...ఎయిరిండియా గా సేవలు అందించంది. దేశంలోకి ప్రైవేట్ కంపెనీలు వచ్చిన తర్వాత ప్రాభవాన్ని కోల్పోయిన ఎయిరిండియా వేల కోట్ల అప్పుల ఊబిలోకి కూరుకుపోగా....టాటాలే తిరిగి దాని కేంద్రం నుంచి కొనుగోలు చేశారు. కొన్ని దశాబ్దాల తర్వాత ఎయిరిండియా టాటాల వ్యాపార సామ్రాజ్యంలోకి తిరిగి రావటం సంతోషంగా ఉందని ఇప్పటికే రతన్ టాటా తన సంతోషాన్ని పంచుకున్నారు. ఇవాళ్టితో బదలాయింపుల ప్రక్రియ అధికారికంగా పూర్తైందని....టాటాలకే చెందిన టాలస్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఎయిరిండియా విలీనం అయినట్లు కేంద్రం వెల్లడించింది.





















