Tadipatri Dum Biryani: అనంతపురం లో స్పెషల్ ఈ వెరైటీ బిర్యానీలు...| Anantapuram
హైదరాబాద్ దమ్ బిర్యాని, చెట్టినాడు బిర్యానీ , మొగలాయి బిర్యానీ, అరబ్ బిర్యానీ తదితర ఎన్నో రకాల బిర్యానీలు ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి .ఈ బిర్యానీల తరహాలోనే తాడిపత్రి దమ్ బిర్యాని అనంతపురం జిల్లాలో ఫేమస్. అయితే ఈ బిర్యాని తినాలంటే గతంలో తాడిపత్రి కి వెళ్ళాల్సి వచ్చేది. ఈ బిర్యానీ రెసిపీ పుట్టిల్లు మాత్రం తాడిపత్రి. అక్కడ ఈ బిర్యానీ ఎంత ప్రాచుర్యం పొందిందంటే ..ఒకే వీధిలో 23 తాడిపత్రి దమ్ బిర్యానీ హోటళ్ళు ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు. తాడిపత్రి దమ్ బిర్యానీ రుచి చూడాలంటే తాడిపత్రికి వెళ్లాలి అనుకుంటున్నారేమో.. అక్కర్లేదు. తాడిపత్రి దమ్ బిర్యాని హోటళ్ళు అనంతపురం పట్టణంలోనే కూడా వెలిశాయి. కాబట్టి ఎంచక్కా అనంతపురం పట్టణంలో కూడా ఆరగించవచ్చు.





















