Super Star Mahesh Babu : స్కిమిటార్ సిండ్రోమ్ తో బాధపడుతున్న చిన్నారికి మహేష్ హార్ట్ సర్జరీ
సూపర్ స్టార్ మహేష్ బాబు మరో చిన్నారి ప్రాణాలను కాపాడారు. స్కిమిటార్ సిండ్రోమ్‌తో బాధపడుతున్న చిన్నారికి హార్ట్ సర్జరీ చేయించారు.సూపర్ స్టార్ మహేష్ మరోసారి తన మంచి మనసు చాటారు. ఓ చిన్నారి గుండె ఆపరేషన్‌కు సాయం చేసి రియల్ హీరో అనిపించుకున్నారు. మహేష్ బాబు భార్య నమ్రతా శుక్రవారం ఆమె ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. మహేష్ బాబు చేపడుతున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా చిన్నారులకు గుండె సంబంధిత సమస్యలకు శస్త్రచికిత్సలు అందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా స్కిమిటార్ సిండ్రోమ్(scimitar syndrome) అనే సమస్యతో బాధపడుతున్న సహస్ర అనే చిన్నారి సర్జరీకి మహేష్ బాబు సాయం చేశారు. చికిత్స తర్వాత చిన్నారి కోలుకుందని, ఇప్పుడు క్షేమంగానే ఉందని నమ్రతా తెలిపారు. ఇప్పటివరకు మహేష్ బాబు 1050 మందికి శస్త్ర చికిత్సలు చేయించారు.





















