అన్వేషించండి
సంక్రాంతి బరిలోంచి తప్పుకున్న మరో సినిమా... బంగార్రాజుకు లైన్ క్లియరా?
2022 సంక్రాంతికి విడుదలకానున్న చిత్రాల్లో మరో సినిమా వెనక్కు తగ్గింది. అదే సిద్దూ జొన్నలగడ్డ నటించిన డీజే టిల్లు. కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. అయితే ఇటీవల రిలీజైన డీజే టిల్లు టైటిల్ సాంగ్ కు మంచి స్పందన వచ్చింది. టిల్లూ అన్న డీజే పెడితే ఇలాగే ఉంటది అంటూ తీన్మార్ బ్యాక్డ్ డ్రాప్ లో సాగే పాట హీరో క్యారెక్టర్ ను వివరిస్తుంది. అయితే సిద్దూ జొన్నలగడ్డ నటించిన సినిమాల్లో థియేటర్ ను చూడబోయే ఫస్ట్ సినిమా ఇది. దీనిపై మన టిల్లూ చాలా ఆశలు పెంచుకున్నా ఏం చేయలేని పరిస్థితిలో వాయిదా వేశారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆధ్యాత్మికం
న్యూస్
పర్సనల్ ఫైనాన్స్



















