అన్వేషించండి
Protest at Kadapa Collectorate: ఉద్రిక్తంగా మారిన ఉద్యోగుల ఆందోళన
PRC పై ప్రభుత్వం ఇచ్చిన జీవోను ఖండిస్తూ కడపలో ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు ఆందోళన బాటపట్టాయి. కలెక్టరేట్ వద్దకు భారీ ఎత్తున ఉద్యోగులు, ఉపాధ్యాయులు చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులను పెద్ద ఎత్తున మోహరించినా... అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ముళ్ల కంచె బ్యారికేడ్లు తోసుకుని ఉద్యోగులు లోపలికి వెళ్లేందుకు యత్నించారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు చేసిన యత్నాలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో ఉద్రిక్తత తలెత్తింది. ఉద్యోగుల్లో ఒకరు స్పృహ తప్పి పడిపోయినట్టు తెలుస్తోంది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
సినిమా
సినిమా రివ్యూ
శుభసమయం





















