Nellore_Mumbai Highway : నెల్లూరు జిల్లా సంగం వద్ద ప్రమాదకరంగా బండరాళ్లు
నెల్లూరు జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు పరోక్షంగా ప్రజలకు, ప్రభుత్వాలకు ఎన్నో హెచ్చరికలు జారీ చేశాయి. అదే సమయంలో రహదారుల భద్రత, నీటివనరుల్ని ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలు ఏదీ శాశ్వతం కాదనే విషయం రుజువైంది. ఈ క్రమంలో నెల్లూరు-ముంబై జాతీయ రహదారిపై సంగం వద్ద కొండను తొలచి ఏర్పాటు చేసిన రోడ్డు విషయంలో కూడా స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. దాదాపు ఒకటిన్నర కిలోమీటరు పొడవున సంగం కొండల మధ్యగా వెళ్తున్న ఈ రహదారిపైకి బండరాళ్లు పడిపోతున్నాయి. భారీ వర్షాలకు గతంలో ఎప్పుడూ లేనంతగా కొండలపైనుంచి జలపాతాలు జాలువారాయి. వర్షానికి నాని నాని రాళ్ళు గుట్టలు గుట్టలుగా విరిగిపడ్డాయి. కనీసం వర్షాలు తగ్గిన తర్వాత అయినా ఇక్కడ రక్షణ చర్యలు చేపట్టాల్సిన అధికారులు మిన్నకుండి పోయారు. రాత్రివేళ ఈ ప్రాంతంలో ప్రయాణం మరింత ప్రమాదకరంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు రోడ్డుపైకి వచ్చి చేరే రాళ్లను తొలగించడం మినహా అధికారులు శాశ్వత చర్యలు చేపట్టిన దాఖలావు లేవు. రహదారిపై కొండచరియలు విరిగిపడుతున్న దుస్థితిని మీరే చూడండి.