Mirabai Chanu ASP: ఒలింపిక్ సిల్వర్ మెడలిస్ట్ మీరాబాయి చాను కి పోలీస్ ఉన్నతోద్యోగం
టోక్సో ఒలింపిక్స్ విజేత మీరాబాయి చానుకి పోలీసు ఉన్నతోద్యోగం ఇచ్చి గౌరవించింది మణిపూర్ ప్రభుత్వం. టోక్సో ఒలింపిక్స్ లో వెయిట్ లిఫ్టింగ్ లో రజత పతకం గెలిచిన చానుకి....ప్రభుత్వ ఉద్యోగం ఇస్తున్నట్లు అప్పుడే ప్రకటించిన సీఎం బీరేన్ సింగ్....ఆమెను స్పోర్ట్ విభాగానికి అదనపు ఎస్పీగా నియమిస్తున్నట్లు అధికారిక ప్రకటన చేశారు. దీంతో మీరాబాయి చాను ఏఎస్పీగా బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా చాను ను సీఎం బీరేన్ సింగ్ అభినందించారు. తన తల్లితండ్రుల ఆశీర్వాదం తీసుకుని బాధ్యతలను స్వీకరించిన చాను...అనంతరం వారిని తన సీట్లో కూర్చోపెట్టి ఆనందపడింది. మణిపూర్ లో క్రీడల అభివృద్ధికి ఏఎస్పీ గా తన వంతు సహకారం అందిచనున్నారు మీరాబాయి చాను.





















