Minsiter Satyavathi Rathod: ప్రతీ ఒక్కరి ముఖంలో చిరునవ్వు చూడాలనేదే సీఎం కేసీఆర్ లక్ష్యం
దేవుడు దివ్యాంగులను చిన్న చూపు చూసినా ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని విధాల ఆదుకుంటున్నారని, దేశంలో ఎక్కడా లేనన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించిన ఆమె.. దేశంలో ఎక్కడా లేనివిధంగా దివ్యాంగులకు 3016 రూపాయల పెన్షన్ ఇస్తున్నామని, మూడు చక్రాల మోటార్ వాహనాలను, ల్యాప్ ట్యాప్, స్మార్ట్ ఫోన్లు, సబ్సిడీ రుణాలు అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వు ఉండాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కేసిఆర్ గారు త్వరలో ట్రాన్స్ జెండర్స్ పాలసీ కూడా తీసుకువస్తున్నారని తెలిపారు. సమాజంలో అందరూ సంతోషంగా ఉండాలనే ధ్యేయంతో అన్ని వర్గాల వారికి అన్ని రకాల పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు.





















