Manchu Vishnu on Ramoji Rao Demise | రామోజీరావు పార్ధివదేహానికి విష్ణు నివాళులు
తెలుగు సినిమా ఇండస్ట్రీని మూడు తరాలుగా నడిపిస్తున్న రామోజీరావు మరణం పరిశ్రమకు తీరని లోటన్నారు మంచు విష్ణు.
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసిన బాహుబలి, RRR సినిమాలను రామోజీ ఫిలిం సిటీలోనే ఎస్ ఎస్ రాజమౌళి తీశారు. సిటీకి దగ్గర్లో సేఫ్టీ అండ్ సెక్యూర్డ్ ప్లేస్ లో అన్ని వసతులతో ఫిలిం సిటీ ఉండేలా రామోజీ రావు RFC ని తీర్చి దిద్దిన విధానమే గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి చేరేలా చేసింది. ఎ సిటీ వితిన్ ఏ సిటీ అని గార్డియన్ పత్రిక కొనియాడిందంటే అర్థం చేసుకోవచ్చు రామోజీ ఫిలిం సిటీ తో రామోజీరావు తీర్చిదిద్దిన సామ్రాజ్యం ఎలాంటిదో. 1997లో షూటింగ్ జరిగిన మానాన్నకు పెళ్లి సినిమా రామోజీ ఫిలిం సిటీలో మొదటిది. ఫిల్మ్ సిటీ లోనే గార్డెన్లు, విదేశీ నగరాల సెట్లు, రైల్వే స్టేషన్, ఎయిర్ పోర్టుల సెట్లు అన్నీ ఉంటాయి. ఫిలిం సిటీలో ఆరు స్టార్ హోటల్స్, 47పర్మినెంట్ సెట్లు ఉండటం సినిమాల నిర్మాణం ఇక్కడ ఎక్కువగా జరగటానికి కారణమైంది. ఏడాది 400 నుంచి 500 సినిమాల షూటింగ్ RFC లో జరిగేలా స్టూడియోను డిజైన్ చేయించారు రామోజీరావు. ఏ రోజైనా 15సినిమాల షూటింగ్ ఎట్ టైమ్ జరిగే ఫెసిలిటీస్ ఉండటంతో దేశవ్యాప్తంగా అనేక భాషా చిత్రాలు రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకునేందుకు రావటానికి రీజన్స్ గా మారాయి. కేవలం సినిమాల నిర్మాణమే కాకుండా దాన్నో టూరిస్ట్ స్పాట్ గానూ తీర్చిదిద్దారు రామోజీరావు. ఏటా 15లక్షల మంది పర్యాటకులు రామోజీ ఫిలింసిటీని సందర్శించేందుకు వస్తుంటారు. అలా తన విజన్ తో హాలీవుడ్ ను తలదన్నే స్థాయి సినిమా స్టూడియోను నిర్మించిన రామోజీరావు ఇండియన్ సినిమాకు తన వంతుగా ఓ అపార సందను కాంట్రిబ్యూట్ చేశారు.