(Source: ECI/ABP News/ABP Majha)
Loksabha Speaker Elections | లోక్‌సభ స్పీకర్ పదవికి అభ్యర్థిని నిలబెట్టనున్న ఇండీ కూటమి | ABP Desam
స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా లోక్‌సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరగనుంది. సభాపతి పదవి కోసం ఎన్డీయే తరఫున ఓంబిర్లా (Om Birla), I.N.D.I.A కూటమి తరఫున కేరళ కాంగ్రెస్ ఎంపీ కె.సురేశ్ (Suresh) బరిలో నిలిచారు. ఈ ఇద్దరు నేతలు స్పీకర్ పదవి కోసం మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. వాస్తవానికి లోక్‌సభలో స్పీకర్ పదవిని అధికార పక్షం, డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షం తీసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. గత హయాంలో డిప్యూటీ స్పీకర్ లేకుండానే సభలు నడిచాయి. అయితే, ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో దిగువ సభలో తమ బలాన్ని పెంచుకున్న ప్రతిపక్షాలు ఈసారి మాత్రం డిప్యూటీ స్పీకర్ పదవి కోసం పట్టుబట్టాయి. తమకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాల్సిందేనని.. లేకుంటే సభాపతి స్థానం కోసం తాము అభ్యర్థిని నిలబెడతామని చెప్పాయి. ఈ క్రమంలో బీజేపీ కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను రంగంలోకి దించింది. ఆయన మంగళవారం ఉదయం నుంచీ I.N.D.I.A కూటమి నేతలు మల్లికార్జునఖర్గే, ఎంకే స్టాలిన్, ఇతర నేతలతోనూ వరుస చర్చలు జరిపారు.