Guinness World Record: సూక్ష్మ కళ లో అద్భుతాలు చేస్తున్న కొప్పినీడి విజయమోహన్
జస్ట్ అలా ఒత్తితే చాలు చటుక్కున విరిగిపోయే పెన్సిల్ లెడ్. ఆ యువకుడి చెయ్యి పడితే చాలు చక్కటి గొలుసుల మారిపోతుంది. అత్యంత అల్పమైన పెన్సిల్ లెడ్ ( పెన్సిల్ ముళ్ళు)తో కొలమానం తో సరిసమానమైన గొలుసు తయారుచేసి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో స్థానం సంపాదించాడు ఒక యువకుడు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్నం రుస్తుంబాధ కు చెందిన కొప్పినీడి విజయమోహన్ ఈ ఘనత సాధించాడు.. గతంలో కూడా 212 లింకులతో 45 సెంటీమీటర్లు పెన్సిల్ ముళ్ళు గొలుసు తయారు చేయగా ఆ రికార్డును అధిగమించి ఇప్పుడు 246 లింకులుతో కేవలం 37 సెంటీమీటర్ల పొడవు తో తయారుచేసి గిన్నిస్ లో స్థానం సంపాదించాడు. ముక్కలు, పెన్సిళ్లు, అగ్గిపుల్లలు, బియ్యపు గింజలు, కొవ్వొత్తులు, కొబ్బరి చిప్పలు, కొబ్బరి పీచు, ఎదురు బొంగు, టూత్ పిక్, కోడి గుడ్డు గుల్లలు, చేప పొలుసు తో చక్కని కళాఖండాలను తీర్చిదిద్దారు. వీటిలో కొన్ని తెలిస్తే ఔరా అనిపిస్తుంది.