KarimNagar - Nizamabad highway: కొత్తపల్లి దాటక కెనాల్ దగ్గర వచ్చే మలుపుతో ప్రమాదాలు
కరీంనగర్- నిజామాబాద్ హై వే పై కొత్తపల్లి దాటాక కెనాల్ వద్ద వస్తుంది బైపాస్ కి సంబంధించిన మూల మలుపు...ఇది కరీంనగర్-సిరిసిల్ల వెళ్లే దారిలో చింతకుంట వద్ద కలుస్తుంది...అయితే పెద్ద గ్రానైట్ రాళ్లను, ఇతర భారీ లోడ్ లతో వెళ్లే అనేక లారీలు, ఇతర గూడ్స్ వాహనాలు ఈ దారి గుండా షార్ట్ కట్ కోసం వెళ్తాయి...ఇక్కడే వచ్చింది అసలు చిక్కు...చింతకుంట వద్ద ప్రారంభమైన నాన్ లోకల్ భారీ వాహనాలకు రూట్ పై అవగాహన లేకపోవడంతో కొన్ని కిలోమీటర్లు ఏకబిగిన స్పీడ్ తో వచ్చి సరిగ్గా వెలిచాల గ్రామ శివారులో ఉన్న బ్రిడ్జి వద్ద "L" షేప్ లో ఉన్న రహదారి వద్ద వేగాన్ని అదుపు చేయలేక ఇతర వాహనాలను ఢీ కొట్టడం గానీ, బోల్తా కొట్టడం గాని జరిగింది. ఎక్కడా హెచ్చరిక బోర్డులు లేకపోవటంతో తమ డ్రైవర్ అయోమయంలో వాహనం బోల్తా కొట్టించాడని...కానీ తామే తప్పు చేసినట్లు స్థానిక అధికారులు ఫైన్ కట్టమని అంటున్నారు అని వాపోయాడు ట్రాన్స్పోర్ట్ కంపెనీ యజమాని.మరోవైపు తమకు ఈ ప్రాంతంలో వరుస ఆక్సిడెంట్ ల వల్ల కరెంటు పోవడం లాంటి సమస్యలు ఎదురవుతున్నాయి అని , హెచ్చరిక బోర్డులు , స్పీడ్ బ్రేకర్ లు పెడితే ప్రమాదాలు తగ్గుముఖం పడతాయని విద్యుత్ సిబ్బంది అంటున్నారు.మరోవైపు డేంజర్ బోర్డులు లేక ప్రమాదాల వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోయారని , ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు