Kaikala Satyanarayana thanks CM Jagan: సీఎం జగన్ కు కైకాల కృతజ్ఞతల లేఖ
CM Jaganకు సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు. తన అనారోగ్య సమయంలో సహాయం అందించి ప్రత్యేక శ్రద్ద చూపించినందుకు ధన్యవాదాలు చెబుతూ లేఖ రాశారు. నవంబర్ లో తీవ్ర అనారోగ్యం బారినపడ్డ ఆయన... ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారు. బిజీగా ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా కాల్ చేసి ప్రభుత్వం నుంచి సాయం అందిస్తామని హామీ ఇవ్వడం సంతోషకరమన్నారు. ఉన్నతాధికారులు వ్యక్తిగతంగా హాజరై, ఆర్థికసాయంతో పాటు అన్ని చూసుకున్నారని వెల్లడించారు. నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పిన కైకాల... తాను సంతకం చేయలేని స్థితిలో ఉండటంతో తన కుమారుడు సంతకం చేస్తున్నట్టు చెప్పారు. తన కష్టకాలంలో అండగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.





















