'Melodi' Again Shaking Social Media | ఇటలీ ఇండియా అధినేతలు..అంతకు మించి దోస్తులు
జీ 7 సభ్య దేశాల సమావేశానికి ప్రధాని మోదీ విశిష్ఠ అతిథిగా హాజరయ్యారు. జీ7 దేశాల్లో సభ్య దేశం కాకపోయినప్పటికీ ప్రస్తుతం భారత్ కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రాధాన్యత దక్షిణాసియా దేశాలకు భారత్ నేతృత్వం వహిస్తున్న విధానంగా జీ7 శిఖరాగ్ర సమావేశాలకు భారత్ ను తప్పనిసరి చేసేలా చేస్తోంది. ఈసారి ఇటలీలో జరిగిన ఈ సమ్మిట్ లో ప్రధాని మోదీ కి ఆత్మీయ స్వాగతం లభించింది. రీజన్ ఇటలీ అధ్యక్షురాలు జార్జియా మెలనీ. భారత్ సంస్కృతి సంప్రదాయాలంటే ఎంతగానో ఇష్టపడే మెలనీ కొన్నేళ్లుగా ప్రధాని మోదీతో కలిసినప్పుడల్లా ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నారు. వాళ్లిద్దరీ మధ్య ఉన్న దోస్తీ...ఒకరి నుంచి మరొకరు సంస్కృతి సంప్రదాయాలను నేర్చుకుంటున్న వైనం..వాళ్లు దిగే సెల్ఫీలు అన్నీ వైరల్ గా మారుతున్నాయి. ఉదాహరణకు ఇది చూడండి మాములుగా షేక్ హ్యాండ్ అతిథులను వెల్కమ్ చేయటం వెస్ట్రన్ కంట్రీస్ లో కామన్. మెలనీ కూడా అలాగే మోదీని వెల్కమ్ చేయాలని అనుకున్నారు. కానీ మోదీ మన నమస్తే ను గ్లోబల్ చేసే పనిలో ఉన్నారు. అందుకే మెలనీ అడుగుతున్నా కూడా చేయి ఇవ్వకుండా నమస్తేనే పెట్టారు. దానికి మెలనీ ఆత్మీయంగా నవ్వుకోవటం..మోదీని ఆటపట్టించటం విజువల్స్ లో చూడొచ్చు. మోదీని కలిసిన ప్రతీసారి నా స్నేహితుడు..భారత్ సంస్కృతికి ప్రతినిధి మోదీతో సెల్పీ అంటూ మెలనీ సెల్ఫీలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. ఈసారి కూడా అలాగే చేశారు. పైగా మోదీకి భారత్ కి అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన ఇటలీ అధ్యక్షురాలు...జీ7 దేశాల్లో సభ్య దేశం కాకపోయినా ఆయా దేశాల అధినేతలు దిగే గ్రూప్ ఫోటోలో మోదీకి సెంటర్ స్టేజ్ ఇచ్చి ఆయన పట్ల ఉన్న గౌరవాన్ని, భారత్ పట్ల ఉన్న ప్రేమను చాటుకున్నారు. అందుకు పాలిటిక్స్ అతీతమైన ఈ ఇద్దరు దేశాధినేతల దోస్తీని మెలడీ అంటూ వైరల్ చేస్తున్నారు నెటిజన్స్.