అన్వేషించండి

PM Modi World Yoga Day in Srinagar | జమ్ము కశ్మీర్ లో ప్రపంచ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ | ABP

జమ్ముకశ్మీర్‌లో జరిగిన యోగ దినోత్సవంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. అందరితో కలిసి యోగాసనాలు వేశారు.దేశవ్యాప్తంగా అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకలు జరిగాయి. పలు చోట్ల ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సారి ప్రధాని నరేంద్ర మోదీ జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో జరిగిన అంతర్జాతీయ యోగ దినోత్సవంలో పాల్గొన్నారు.శ్రీనగర్‌లోని SKICC సెంటర్‌లో యోగ దినోత్సవ వేడుకలు జరిగాయి. ప్రధాని మోదీ ఈ సెషన్‌లో పాల్గొన్నారు. అందరితో కలిసి యోగాసనాలు వేశారు. పదో అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని ఇలా కశ్మీర్‌లో జరుపుకున్నారు. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.దాల్‌ లేక్‌ తీరంలో ఈ యోగ దినోత్సవం నిర్వహించారు. ఈ ఏడాది Yoga for Self and Society అనే థీమ్‌తో వేడుకలు జరిగాయి. మన ఆరోగ్యానికే కాకుండా సమాజానికి యోగ ఎంత మేలు చేస్తుందో చెప్పడమే ఈ థీమ్ ఉద్దేశం.ఇండోర్‌ హాల్‌లో ప్రధాని మోదీ యోగాసనాలు వేశారు. ఎక్కువ మంది ఈ కార్యక్రమంలో హాజరు కావాల్సి ఉన్నా అక్కడ వర్షం కురుస్తుండడం వల్ల పరిమిత సంఖ్యలోనే హాజరయ్యారు. దాదాపు అరగంట పాటు ఈ కార్యక్రమం కొనసాగింది.ఏటా ఒక్కో చోట యోగ దినోత్సవంలో పాల్గొంటున్నారు ప్రధాని మోదీ. గతేడాది న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి హెడ్‌క్వార్టర్స్‌లో వేడుకలు జరిగాయి. ఈ సారి కశ్మీర్‌లో పాల్గొని అందరి దృష్టినీ ఆకర్షించారు.అంతకు ముందు ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్లతో కాసేపు ముచ్చటించారు మోదీ. అందరి నవ్వుతూ పలకరించారు. మోదీ రాకతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది.ఈ సందర్భంగా అక్కడి వాళ్లను ఉద్దేశిస్తూ ప్రసంగించారు ప్రధాని. యోగ ప్రాముఖ్యత ఏంటో వివరించారు. అందరికీ యోగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కొద్ది రోజులుగా ఉగ్రదాడులతో వణికిపోతున్న కశ్మీర్‌లోనే మోదీ ఈ వేడుకలు చేయడం కీలకంగా మారింది.

ఇండియా వీడియోలు

Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Donald Trump China Visit: అమెరికా, చైనా సూపర్ పవర్స్.. చైనా రెండో స్థానంలో ఉంటుంది- డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
అమెరికా, చైనా సూపర్ పవర్స్.. చైనా రెండో స్థానంలో ఉంటుంది- డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
Gold Import Duty: బంగారం, వెండిపై దిగుమతి సుంకం రెట్టింపు.. ప్రధాని మోదీ మాటలకు అర్థం ఇదే!
బంగారం, వెండిపై దిగుమతి సుంకం రెట్టింపు.. ప్రధాని మోదీ మాటలకు అర్థం ఇదే!
Lockdown Rumors: దేశంలో మళ్లీ లాక్‌డౌన్ భయాలు - ప్రధాని సూచనలపై పానిక్ - అసలు ఏం జరగబోతోంది?
దేశంలో మళ్లీ లాక్‌డౌన్ భయాలు - ప్రధాని సూచనలపై పానిక్ - అసలు ఏం జరగబోతోంది?
AIADMK Split: తమిళ విశ్వాస పరీక్ష - అన్నాడీఎంకే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందా? విజయ్ వద్ద ప్లాన్ బీ ఉందా?
తమిళ విశ్వాస పరీక్ష - అన్నాడీఎంకే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందా? విజయ్ వద్ద ప్లాన్ బీ ఉందా?

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gold Import Duty: బంగారం, వెండిపై దిగుమతి సుంకం రెట్టింపు.. సామాన్యులకు భారంగా మారనున్న ధరలు
బంగారం, వెండిపై దిగుమతి సుంకం రెట్టింపు.. సామాన్యులకు భారంగా మారనున్న ధరలు
Lockdown Rumors: దేశంలో మళ్లీ లాక్‌డౌన్ భయాలు - ప్రధాని సూచనలపై పానిక్ - అసలు ఏం జరగబోతోంది?
దేశంలో మళ్లీ లాక్‌డౌన్ భయాలు - ప్రధాని సూచనలపై పానిక్ - అసలు ఏం జరగబోతోంది?
AP Local Body Elections: మూడు నెలల్లో ఏపీ స్థానిక ఎన్నికల నగారా? కూటమిలో సీట్ల పంచాయతీ.. బాబు ముందున్న సవాల్ ఇదే!
మూడు నెలల్లో ఏపీ స్థానిక ఎన్నికల నగారా? కూటమిలో సీట్ల పంచాయతీ.. బాబు ముందున్న సవాల్ ఇదే!
LPG Gas Subsidy: ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీ కావాలంటే ప్రతి ఏడాది E-KYC తప్పనిసరి.. లేకపోతే సబ్సిడీ బంద్
ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీ కావాలంటే ప్రతి ఏడాది E-KYC తప్పనిసరి.. లేకపోతే సబ్సిడీ బంద్
ఒకే ఛార్జ్‌పై 490 కి.మీ రేంజ్ ఇచ్చే Kia Carens Clavis Ev పై 2 లక్షలకు పైగా బెనిఫిట్స్.. ఫీచర్లు చూసి కొనేయండి
ఒకే ఛార్జ్‌పై 490 కి.మీ రేంజ్ ఇచ్చే Kia Carens Clavis Ev పై 2 లక్షలకు పైగా బెనిఫిట్స్.. ఫీచర్లు చూసి కొనేయండి
Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Embed widget