Man attending court from Toilet | హైకోర్టు జడ్జి విచారణకు టాయెలెట్ నుంచి హాజరు | ABP Desam
గుజరాత్ హైకోర్టుకు ఓ యువకుడు బాత్రూం నుంచి అటెండ్ అవ్వటం సంచలనంగా మారింది. చెక్ బౌన్స్ కేసుకు సంబంధించిన విచారణ కోర్టులో రూం లో జరుగుతోంది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ నిర్జార్ దేశాయ్, న్యాయవాది చేసే వాదనలను వింటున్నారు. విజిటర్ యాక్సెస్ తోనో లేదా కోర్టు విచారణకు సంబంధించిన లిటిగెంట్ కావటంతోనో సమద్ బ్యాటరీ అనే ఓ యువకుడు వర్చువల్ గా విచారణకు హాజరయ్యాడు. అయితే అది టాయెలెట్ కమోడ్ నుంచి కావటమే ఇప్పుడు ఈ వీడియోను వైరల్ చేస్తోంది. హైకోర్టు న్యాయమూర్తి విచారణ అంటేనే ఓ రకమైన భయం, గౌరవం ఉంటాయి అలాంటిది ఈ యువకుడు అవేం పట్టన్నట్లు వేరే వాళ్లకు కనపడతాననే భయం కూడా లేకుండా ఇలా విచారణకు అటెండ్ అవటం, ప్రొసీడింగ్స్ లో ఓ యువతి కూడా ఉండటంతో ఇప్పుడు ఈ వివాదం ఎంత దూరం వెళ్తుందో చూడాలి.
ఒకవేళ కోర్టు ఈ విషయాన్ని సీరియస్ తీసుకుంటే ధిక్కరణ, కోర్టు గౌరవమర్యాదలకు భంగం కింద కేసు నమోదు అయ్యే అవకాశం ఉంది.





















