Gautam Adani Speech At Puri Rathayatra | పూరీ జగన్నాథుడి రథయాత్రలో మాట్లాడిన అదానీ | ABP Desam
పూరీ జగన్నాథుడి రథయాత్రలో అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతం అదానీ ఆయన కుటుంబంతో కలిసి పాల్గొన్నారు. స్వామి వారి దర్శనం అనంతరం మాట్లాడిన అదానీ స్వామి వారి కృపతోనే తనకు అన్నీ దక్కినట్లు చెప్పారు. జగన్నాథ్ మహాప్రభు ప్రజల మధ్యకు వచ్చే ఈ క్షణం ఎంతో గొప్పది. ఇవి కేవలం ఆధ్యాత్మిక క్షణాలే కాదు ఆ భగవంతుడి ముందు మనం ఎంత వినయంగా నిలబడాలో కూడా చెప్పేవి. మహాప్రభువు పాదపద్మాల దగ్గరకు వచ్చే అదృష్టం ఈ రోజు నాకు లభించింది. ఇలాంటి రోజు నాకు ఎప్పటికి గుర్తుండిపోతాయి. ఒకప్పుడు నా దగ్గర ఏం లేదు. కానీ ఆ భగవంతుడి ఆశీర్వాదం, ప్రజల ప్రేమ తో ఈ రోజు దగ్గర అన్నీ ఉన్నాయి. మన దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం ఒడిషా ప్రగతి ప్రథంలో పయనించటం కోసం భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ప్రజలు ఆ సత్ఫలితాలను పొందాలని కోరుకుంటున్నట్లు అదానీ సంస్థల ఛైర్మన్ గౌతమ్ అదానీ తెలిపారు





















