Air India Crash Report | Cockpit Voice Recorder లో రికార్డైన మాటలు ఇవే | ABP Desam
అహ్మదాబాద్ లో ఎయిరిండియా విమానం కూలి 270మంది ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటన ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో AAIB అనేక కీలక విషయాలను బయటపెట్టింది. వాటిలో కాక్ పిట్ లో రికార్డైన మాటల విషయం కూడా ఉంది. విమానం కూలిపోయే కొద్ది క్షణాలు పైలెట్స్ ఏం మాట్లాడుకున్నారనే విషయం విమాన ప్రమాదాల్లో ఎప్పుడూ కీలకంగా ఉంటుంది. దర్యాప్తులో ఈ అంశమే ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. అలాంటిది అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో కాక్ పిట్ లో విమానం ప్రమాదం జరిగే ముందరి 30 సెకన్ల మాటలు రికార్డ్ అయ్యాయి. జూన్ 12 మధ్యాహ్నం 1.37.37 సెకన్లకు విమానం టేకాఫ్ అయ్యింది.
1.38.39 సెకన్లకు కి పూర్తిగా విమానం గాల్లోకి లేచింది.
1.38.42 విమానం తన గరిష్ఠ వేగానికి చేరుకోగానే ఇంజిన్ 1, ఇంజిన్ 2 లకు చెందిన ఫ్యూయల్ స్విచ్ఛెస్ రన్ నుంచి కటాఫ్ పొజిషన్ లోకి వెళ్లిపోయాయి. అప్పుడే ఓ పైలైట్ మరో పైలైట్ తో ఫ్యూల్ స్విచ్చెస్ ఎందుకు కటాఫ్ చేశావ్ అని అడిగిన ప్రశ్న రికార్డైంది. తను మార్చలేదని మరో పైలెట్ చెప్పటం ఈలోగా విమానం కిందకు జారిపోయింది. ఎయిర్ పోర్ట్ పెరిమీటర్ గోడ దాటగానే మళ్లీ ఇంధన్ స్విచ్ఛ్ లు కటాఫ్ నుంచి రన్ కి మారినా అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. సో ఆ 30 సెకన్లలోనే విమానంలో ఉన్న 241 ప్రాణాలు..మెడికల్ కాలేజీ హాస్టల్ లో ని విద్యార్థులు సహా 270 మంది ప్రాణాలు ఘోర ప్రమాదంలో బుగ్గి అయిపోయాయి.





















