Honour Killing: అమ్మాయిని ప్రేమించాడని దారుణంగా హత్య
నెల్లూరు జనార్థన్ రెడ్డి కాలనీకి చెందిన షేక్ అల్తాఫ్ హత్య కేసులు పోలీసులు చేధించారు. తన బంధువుల అమ్మాయిని ప్రేమించిన అల్తాఫ్...ఆమెను పెళ్లి చేసుకునేందుకు సిద్ధణయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న యువతి తండ్రి కాలేష...తన కుమారుడు షేక్ హఫీజ్, కుమారుడి స్నేహితుడు షేక్ హమీద్ తో కలిసి....అల్తాఫ్ ను దారుణంగా హత్య చేశారు. అంతే కాదు అల్తాఫ్ పై తన కుమార్తెకు దురాభిప్రాయం కలిగిలేలా కొంతమంది యువతులతో ఉన్నట్లు మార్ఫింగ్ ఫోటోలను ఫేస్ బుక్ లో పోస్ట్ చేయించి అనుమానం రాకుండా ఉండేలా పథకరచన చేసినట్లు పోలీసులు తెలిపారు. నగర డీఎస్పీ శ్రీనివాసరెడ్డి కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. యువతి తండ్రి, సోదరుడితో పాటు అతని స్నేహితుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపిన పోలీసులు..కోర్టులో హాజరుపరచనున్నట్లు వివరించారు.





















