అన్వేషించండి

కెనడా మరో పాకిస్థాన్‌గా మారుతోందా, ఇండియాతో ఎందుకీ కయ్యం?

ఊరందరికీ ఓ దారైతే..ఉలిపిరికట్టెది మరో దారి అన్నట్టుగా ఉంది కెనడా వైఖరి. భారత్‌తో అన్ని దేశాలూ ఫ్రెండ్‌షిప్ చేయాలని చూస్తున్నాయి. పాత విభేదాలు ఏమున్నా అవన్నీ పక్కనపెట్టి కలిసిపోతున్నాయి. సొంత లాభం కొంతచూసుకున్నా.. భారత్‌తో మైత్రిని కంటిన్యూ చేయాలనే చూస్తున్నాయి దాదాపు అన్ని దేశాలు. పొరుగున ఉన్న పాకిస్థాన్ మాత్రం ఎప్పుడూ కయ్యానికి కాలు దువ్వుతూనే ఉంటుంది. భారత్‌ని చిరకాల శత్రువుగానే చూస్తోంది ఆ దేశం. ఎప్పుడు యుద్ధం జరుగుతుందో అన్న స్థాయిలో ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తోంది పాక్. ఇప్పుడు కెనడా వైఖరిని చూస్తుంటే..మరో పాకిస్థాన్‌లా తయారైనట్టుగా ఉంది. పాక్‌ ఎలా అయితే..భారత్‌ని కవ్విస్తోందో..అదే విధంగా ఉంది కెనడా తీరు. ఏకంగా భారత హైకమిషనర్‌పైనే సంచలన ఆరోపణలు చేసింది. నిజ్జర్ హత్య కేసులో అనుమానితుల లిస్ట్‌లో ఆయన పేరు చేర్చింది. దీనిపై భారత్ భగ్గుమంది. ఏ మాత్రం ఆధారాలు చూపించకుండా..హైకమిషనర్ స్థాయి వ్యక్తిపై ఇలాంటి ఆరోపణలు చేయడమే కెనడాపై విమర్శలు వెల్లువెత్తేలా చేసింది. 

పాకిస్థాన్ కూడా ఇంతే. ఆర్నెల్ల క్రితం పాక్ ఇంటిలిజెన్స్ సంస్థ సంచలన వ్యాఖ్యలు చేసింది. తమ దేశంలో భారత్‌ పెద్ద ఎత్తున హత్యలకు పాల్పడుతోందని ఆరోపించింది. 2019 తరవాత దేశ భద్రత పేరుతో నరమేధం సృష్టిస్తోందనీ...ఇష్టమొచ్చినట్టు కామెంట్స్ చేసింది. దీనిపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ చాలా తీవ్రంగా స్పందించారు. యాంటీ ఇండియా ప్రాపగండా అని మండి పడ్డారు. అయినా..ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోలేదు పాకిస్థాన్. ఇప్పుడు కెనడా తీరు చూడబోతే ఇలాగే ఉంది. ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని అడిగితే నీళ్లు నములుతోంది. కానీ..అంతా ఇండియానే చేసిందని ఆరోపిస్తోంది. కెనడా ప్రధాని జస్టిన ట్రూడో కూడా యాంటీ ఇండియా అజెండాతోనే పాలిటిక్స్ చేస్తున్నారు. పైగా రాజకీయాలపై ప్రభావం చూపించే సిక్కుల కోసం ఈ పొటిలికల్ గేమ్ ఆడుతున్నారన్న వాదనలూ గట్టిగానే వినిపిస్తున్నాయి. కెనడా బహిరంగంగా అతివాద సంస్థలతో స్నేహం చేస్తోందని ఇండియా తేల్చి చెబుతోంది. తీవ్రవాదులతో సన్నిహితంగా ఉండడం, భారత్‌పై విషం చిమ్మడం...అనవసరపు ఆరోపణలు చేయడం. ఇవన్నీ చూస్తుంటే..కెనడా పాకిస్థాన్‌కి డూప్‌లా తయారైందన్న మాట వినిపిస్తోంది.

న్యూస్ వీడియోలు

నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటా
నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటా
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
Group 2 Exams: తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Atul Subhash Case: బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
Group 2 Exams: తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Atul Subhash Case: బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
Aadhaar Card Updating: ఆధార్‌ ఉన్న వారికి గుడ్ న్యూస్ - ఫ్రీ అప్ డేట్ గడువు మరో 6 నెలలు పెంపు, ఇదీ ప్రాసెస్
ఆధార్‌ ఉన్న వారికి గుడ్ న్యూస్ - ఫ్రీ అప్ డేట్ గడువు మరో 6 నెలలు పెంపు, ఇదీ ప్రాసెస్
Hyderabad News: 14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం
14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం
CM Chandrababu: 'సార్.. ఒక్క ఫోటో ప్లీజ్' - సీఎం చంద్రబాబుకు బాలిక రిక్వెస్ట్, ఆయన ఏం చేశారంటే?
'సార్.. ఒక్క ఫోటో ప్లీజ్' - సీఎం చంద్రబాబుకు బాలిక రిక్వెస్ట్, ఆయన ఏం చేశారంటే?
Vajedu SI Suicide Case: వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
Embed widget