Chalmeda Medical college : కరీంనగర్ చల్మెడ మెడికల్ కళాశాలలో 49కి చేరుకున్న కరోనా కేసులు | ABP Desam
కరీంనగర్ జిల్లా కేంద్రానికి సమీపంలోని చల్మెడ మెడికల్ కాలేజీలో కరోనా వచ్చిన విద్యార్థుల సంఖ్య 49 కి చేరింది . ఇప్పటికే మెడికల్ కాలేజీకి హాలిడే ప్రకటించిన యజమాన్యం కరోనా వచ్చిన వారిని క్వారంటైన్ లో ఉంచి చికిత్స అందిస్తోంది. మిగతా వారికి సైతం పరీక్షలు నిర్వహించి పరిస్థితిని అదుపులోకి తెస్తామని జిల్లా వైద్య శాఖ అధికారిణి డాక్టర్ జువేరియా తెలిపారు. ఇదే విషయంపై మాట్లాడిన చల్మెడ మెడికల్ కాలేజీ ఛైర్మన్ చల్మెడ లక్ష్మీ నరసింహరావు.....బయట నెలకొన్న పరిస్థితుల కారణంగానే కేసులు నమోదవుతున్నాయని...ఆరోగ్యశాఖ అధికారులతో మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చామని తెలిపారు.తమ కళాశాలపై వస్తున్న వదంతులను ఆయన ఖండించారు.





















