![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Kalki 2898 AD Trailer Review | కల్కి ట్రైలర్ Decoded.! ఎవరికీ తెలియని పాయింట్స్ ఈ వీడియోలో
టాలీవుడ్ స్థాయిని హాలీవుడ్ రేంజ్ కు తీసుకెళ్లగల సినిమా ఏదైనా ఉందా..! అది కల్కీనే..! ట్రైలర్ చూసిన తరువాత అందులో ఏ డౌట్ లేదనిపిస్తోంది ఆ విజువల్స్, ఆ టేకింగ్, వాళ్ల యాక్టింగ్ చూస్తుంటే..! సూపర్ అనిపిస్తోంది. మరి..హైప్స్ ని ఆకాశంలోకి తీసుకెళ్లిన ఈ ట్రైలర్ హిడెన్ గా ఉన్న ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి మనం ఇప్పుడు డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం...!
పురాణాల ప్రకారం.. కాశీ నగరాన్ని కాపాడేవాడు కాల భైరవ. సినిమాలో కూడా కాశీ నగరాన్ని కాపాడే బాధ్యత ప్రభాస్ తీసుకుంటాడు కాబట్టి ప్రభాస్ పేరు ఇందులో భైరవగా పెట్టాడు.
కలియుగం అంతమయ్యే సమయంలో కల్కి అవతరిస్తాడు. అతడిని కాపాడాల్సిన బాధ్యత అశ్వత్థామ పై ఉంటుంది. ఆ లైన్ లోనే అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ మొత్తం అతడిని కాపాడటంలోనే ఉంటుంది. అందుకే...కల్కిని కనబోతున్న దీపికా పదుకొణే చుట్టు అమితాబ్ కనిపిస్తున్నారు. కల్కి భూమిపై అవతరించే వరకు దీపికాకు ఏం కాకుండా చూసుకోవడమే అమితాబ్ పని.
ఇక.. కాశీపై నుండే నీళ్ల సామ్రాజ్య అధిపతిగా కమల్ హాసన్ కనిపిస్తున్నారు. సో...ఆ విలన్ ను చంపేస్తే గానీ కాశీకి నీళ్లు రావు .సో.... ఓ టీమ్ అంతా ఆ ప్రపంచంలోకి అడుగుపెట్టి వాడిని చంపాలని చూస్తారు. ఐతే.. ఎప్పటికైనా తన సామ్రాజ్యాన్ని అంతం చేసేది కల్కి భగవానుడే. అందుకే.. అతడు పుట్టక ముందే దీపికా పదుకోణెను చంపాలని కమల్ హాసన్ అండ గ్యాంగ్ ట్రై చేస్తుంది. ఆ గ్యాంగ్ కు భైరవ లాంటి చురుకైన కుర్రాడు కనిపిస్తాడు. ఐతే... ఇప్పుడంటే డబ్బులు ఫ్యూచర్ లో యూనిట్స్ కాబట్టి... యూనిట్స్ దీపికాను అప్పగించే పని పెట్టుకున్న భైరవ.. తరువాత యూనిట్స్ కంటే ధర్మం గొప్పదని..దీపికా పదుకోణే ను కాపాడటంలో ఉన్న సత్యాన్ని గ్రహించే విలన్ కమల్ హాసన్ కు ఎదురు ఎలా వెళ్తాడన్నదే స్టోరీ లైన్ గా కనిపిస్తోంది.
![Ram Charan Participaes in Unstoppable 4 | బాలయ్య, రామ్ చరణ్ సందడిపై భారీగా అంచనాలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/31/7fde108061f1ff67f47dd5aeabde63441735662738325310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=470)
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)