అంబానీ ఇంట్లో గణపతి పూజ, క్యూ కట్టిన బాలీవుడ్ సెలెబ్రిటీలు
ముంబయిలోని ముకేశ్ అంబానీ ఇంట్లో ఈ సారి వినాయక చవితి వేడుకలు మరింత గ్రాండ్ గా జరిగాయి. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఈ గణేశుడిని దర్శించుకోడానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ దంపతులు అతిథులందరినీ పలకరించారు. అందరినీ ఆత్మీయంగా ఆహ్వానించారు. ముకేశ్ అంబానీ, నీతా అంబానీ కూడా గెస్ట్‌లకు వెల్కమ్ చెప్పారు. బాలీవుడ్ సెలెబ్రిటీలు అంబానీ ఇంటికి క్యూ కట్టారు. సల్మాన్ ఖాన్, కరీనా కపూర్, అర్జున్ కపూర్, కియారా అద్వానీ సంప్రదాయ దుస్తులలో వచ్చి వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు. వీరితో పాటు సచిన్ టెండూల్కర్, సునీల్ శెట్టి, సైఫ్ అలీఖాన్ అంబానీ ఇంటికి వచ్చారు. సిద్దార్థ మల్హోత్రా, కియారా అద్వానీ కపుల్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.
గణేశ్ ఉత్సవాలు అంబానీ ఇంట్లో ఎప్పుడూ ఇంతే ఘనంగా జరుగుతుంటాయి. ఆ ఫ్యామిలీలో ఇదో ఆనవాయితీగా వస్తోంది. ఈశా అంబానీ తన ఇద్దరు పిల్లలతో కలిసి గణేశుడి విగ్రహానికి వెల్కమ్ చెప్పారు. ఈ సమయంలో అంతా గణపతి బప్పా మోరియా అంటూ సందడి చేశారు. ఇక ముంబయిలో ఎంతో ఫేమస్ అయిన లాల్బగ్చా రాజ్ గణపతి విగ్రహానికి అనంత్ అంబానీ 20 కిలోల బంగారు కిరీటాన్ని గిఫ్ట్‌గా ఇచ్చారు. దీని విలువ రూ.15 కోట్లు. Spot