Jr NTR Congrats Chandrababu and pawan Kalyan | చంద్రబాబు, బాలయ్యకు జూ.ఎన్టీఆర్ విషెస్
ఏపీ ఎన్నికల ఫలితాలపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నందమూరి బాలకృష్ణ, లోకేశ్, పురంధేశ్వరి, ఎం భరత్ లకు ఎన్టీఆర్ ట్విట్టర్ లో విషెస్ తెలిపారు. కొంత కాలంగా నారా కుటుంబానికి జూనియర్ ఎన్టీఆర్, ఆయన అన్న కళ్యాణ్ రామ్ దూరంగా ఉంటున్నారన్న పుకార్లను తరిమికొట్టేలా ఒక్క ట్వీట్ తో సమాధానం ఇచ్చారు జూనియర్ ఎన్టీఆర్. తన కుటుంబంలో ఎన్నికల్లో పోటీ చేసిన గెలిచిన వాళ్లందరి బంధుత్వ వరుసలను ప్రస్తావించి మరీ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ప్రియమైన చంద్రబాబు మావయ్యకి ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించిందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపున నడిపిస్తుందని ఆశిస్తున్నాను. అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేశ్ కి, మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయికి, ఎంపీగా గెలిచిన శ్రీభరత్ కి, పురందేశ్వరి అత్తకి నా శుభాకాంక్షలు. అలాగే ఇంతటి ఘనవిజయం సాధించిన పవన్ కల్యాణ్ కు కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ ప్రతీ ఒక్కరినీ ప్రస్తావిస్తూ వరుసలతో సహా ట్వీట్ చేశారు. ఇంచు మించుగా ఇదే ట్వీట్ ను నందమూరి కళ్యాణ్ రామ్ కూడా చేశారు. ఎన్టీఆర్ శతజయంతి కి తారక్ రాలేదని..టీడీపీ కోసం ప్రచారమూ చేయలేదని కొంత కాలంగా నారా, నందమూరి కుటుంబాలకు హరికృష్ణ కుమారులిద్దరూ దూరంగా ఉంటున్నారనే వార్తలు హల్ చల్ చేశాయి. ఇలాంటి టైమ్ లో ఎన్టీఆర్ నుంచి వచ్చిన ఈ ట్వీట్ ఆయన అభిమానులకు, టీడీపీ కార్యకర్తలకు ఓ స్వీట్ సర్ ప్రైజ్ అనే చెప్పాలి.