నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం సోమశిల జలాశయం వద్ద సందర్శకుల సందడి పెరిగింది. ఆదివారం కావటంతో ప్రాజెక్ట్ వద్దకు వచ్చిన చిన్నారులు ఈతకు దిగుతున్నారు. అప్రాన్ దెబ్బతిని ఉండటంతో ఈతకు దిగిన వారు మునిగిపోయే ప్రమాదం ఉంది. కొద్ది రోజులుగా జలాశయానికి వరద వస్తుండటంతో 11,12 గేట్ల ద్వారా పెన్నాకు వరద నీటిని వదిలిపెట్టారు. ప్రాజెక్ట్ ముందు ఉన్న అప్రాన్ దెబ్బతిని ఉండడంతో నీళ్లు అందులోకి వస్తున్నాయి. అక్కడికి వచ్చిన సందర్శకులు ఈ నీటిలోకి దిగి ఈత కొడుతున్నారు. ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకపోవటంతో అజాగ్రత్తగా ఉంటున్నారు. అధికారులు పట్టించుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Amalapuram RDO Office : ఆర్డీవో కార్యాలయాన్ని పార్లమెంటు నమూనాలో ఎందుకు | DNN | ABP Desam
Nandigama Munner River : ఎన్టీఆర్ జిల్లా నందిగామలో తృటిలో తప్పిన ప్రమాదం | DNN | ABP Desam
Minister RK Roja Comments : MLC ఎన్నికల్లో టీడీపీ విజయంపై మంత్రి ఆర్కే రోజా | DNN | ABP Desam
BJP Madhav Comments on Janasena : వైసీపీ వ్యతిరేక ఓటంతా టీడీపీకే పడిందన్న మాధవ్ | ABP Desam
Nara Family Donates 33 Lakh Rupees To TTD: టీటీడీకి విరాళమిచ్చిన చంద్రబాబు కుటుంబం
Revanth Reddy On TSPSC : ప్రశ్నాపత్రాలు పల్లి బఠాణీలు అమ్మినట్లు అమ్మేశారు, టీఎస్పీఎస్సీ కేసును సీబీఐకి బదిలీ చేయాలి- రేవంత్ రెడ్డి
KCR in Khammam: రైతులకు కేసీఆర్ గుడ్‌న్యూస్ - ఎకరానికి 10 వేలు, గంటలోనే నిధులు మంజూరు: సీఎం
Orange Re-release: ‘ఆరెంజ్’ రీరిలీజ్ నుంచి వచ్చే ప్రతీ రూపాయి జనసేనకే!
Balagam OTT Release Date: ఓటీటీకి వచ్చేస్తున్న ‘బలగం’ - ఇంత త్వరగానా - ఎందులో స్ట్రీమ్ అవుతుంది?