అన్వేషించండి
CPI Narayana: సీపీఐ నారాయణకు గాయం...ప్రథమచికిత్స చేసిన తిరుపతి ఎంపీ
చిత్తూరు జిల్లాలో అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది.. తిరుపతి రూరల్ మండలం రాయలచెరువు పరిశీలనకు వచ్చిన సీపీఐ నారాయణ కాలికి గాయమైంది.. దీంతో అక్కడ వైసీపీ నేతలు పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.. వెంటనే ఫిజియోథెరపిస్ట్ కూడా అయిన తిరుపతి ఎంపీ గురుమూర్తి నారాయణ కాలికి ప్రథమ చికిత్స చేశారు. ఈ సందర్భంగా సీపీఐ నారాయణ వైసీపీ నేతలైన ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఇతర నేతలతో సరదాగా ముచ్చటించారు.. ఎప్పుడూ వైసీపీ నేతలపై అంత ఎత్తున లేచి పడే నారాయణ వారితో జోకులు వేస్తూ సరదాగా గడపడం ఆసక్తిని రేపింది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
తెలంగాణ
పాలిటిక్స్





















