Chandragiri Accident: చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం... ఆరుగురు మృతి చెందినట్లు అదనపు ఎస్పీ ప్రకటన
చిత్తూరు జిల్లా చంద్రగిరి సమీపంలోని ఐతేపల్లె వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. పూతలపట్టు-నాయుడుపేట రహదారిపై ఐతేపల్లి వద్ద కారు ఒక్కసారిగా అదుపు తప్పి హైవే ప్రక్కనే ఉన్న డివైడర్ ను ఢీ కొని బోల్తా కొట్టి సర్వీస్ రోడ్డులో పడింది.. దీంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న చిన్నారితో సహా మొత్తం ఐదుగురు అక్కడిక్కడే మంటల్లో చిక్కుకుని మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో తిరుపతి లోని రుయా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరో వృద్ధుడు ప్రాణాలు కోల్పోవటంతో..మృతుల సంఖ్య ఆరుకు పెరిగింది. కారులో మొత్తం 8 మంది ప్రయాణం చేస్తున్నట్లు తిరుపతి అదనపు ఎస్పీ సుప్రజ తెలిపారు. మృతులంతా శ్రీకాకుళం జిల్లాకు చెందినవారని..అతివేగమే ప్రమాదమే కారణంగా ప్రాథమికంగా భావిస్తున్నట్లు అడిషనల్ ఎస్పీ ప్రకటించారు.