Pawan Kalyan About PRP: అన్నయ్య చిరంజీవి కోసమే అప్పుడలా చేశా: పవన్ కళ్యాణ్
2008లో జరిగిన పరిణామాలను జనసేన అధినేత పవన్ కల్యాణ్ గుర్తుచేసుకున్నారు. ‘అన్నయ్య చిరంజీవి పార్టీ పెడితే జనాలు లక్షలకొద్దీ వచ్చారు. కేవలం ఆయనకు మద్దతుగా ఉండాలనుకున్నాను, కానీ రాజకీయాల్లోకి రావాలని ఎప్పుడు కోరుకోలేదు. కానీ కొంద మంది పక్కనే ఉండి పార్టీని సరిగా నడపనివ్వలేదు. ఆంధ్ర పాలకులు చేసిన తప్పులకు ఏపీ ప్రజలు నష్టపోయారు. కానీ ప్రజలకు ఏం చేయలేకపోయాం. మనసులో ఉండిపోయిన ఆ లోటును తీర్చుకోవడానికి రాజకీయాల్లోకి వచ్చాను. వైసీపీ పాలన ఎలా ఉందో చెప్పడానికి ఒక్క మెతుకు చూస్తే చాలు. ప్రధాని మోదీ, టీడీపీకి మద్దతు తెలిపితే విమర్శలు చేశారు. వాళ్లకు అధికారం వచ్చాక స్థలాలు అడగవచ్చు కానీ అలా చేయలేదు. ఎందుకంటే నాకు ఆత్మ గౌరవం ఎక్కువ. నాకు డబ్బులు అంతగా అవసరం లేదు. ప్రజల దగ్గర ఓట్లు అడగలేకపోయానంటూ’ పీఆర్పీ పార్టీ పరిస్థితి ఏమైందనే దానిపై పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగిన జనసేన పార్టీ సమావేశంలో పలు అంశాలు ప్రస్తావించారు.





















