Kunool Aided School: కింద కూర్చోనైనా చదువుకుంటాం చేర్చుకోండి ప్లీజ్...
ఎయిడెడ్ పాఠశాలలను టేక్ ఓవర్ చేయాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాలతో కర్నూలు నగరంలోని జోహరాపురం రోడ్డులో గల ఎస్ఆర్సీసీ మోడల్ ఎయిడెడ్ స్కూల్ ను మూసి వేశారు. తొమ్మిది, పదో తరగతి విద్యార్ధినీలకు స్కూల్ సిబ్బంది టీసీల ఇచ్చి పంపించేశారు. పదోతరగతి విద్యార్ధినీలను ఓ పాఠశాలలో చేర్పించుకున్నారు. కానీ మమ్మల్ని ఇతర స్కూల్ వాళ్లు చేర్పించుకోవడం లేదని 14 మంది విద్యార్ధినీలు డిఈవో కార్యాలయం వద్ద టీసీలతో ఆందోళన చేశారు. తమను చేర్పించుకోండని ఇతర స్కూల్ వాళ్లను కాళ్లా వేళ్లా పడినా, కింద కూర్చొని చదువుకుంటామని చెప్పినా వినడం లేదని, విద్యార్ధినీలు, వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయం వలన తమ చదువు మద్యలో అర్ధాంతరంగా ఆగిపోయాయని విద్యార్ధినిలు చెప్తున్నారు.





టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

