Vizianagaram Fort Lesser Known Story | దేశానికి ఆఖరి కోటగా చెప్పే విజయనగరం కోటపై ఆసక్తికర విషయాలు
విజయనగరం..ఈపేరు వినగానే గుర్తొచ్చేవి రెండు. ఒకటే శ్రీకృష్ణదేవరాయలు ఏలిన విజయనగర సామ్రాజ్యం. రెండోది పూసపాటి వంశీయులు ఏలిన విజయనగరం కోట. ఈ రెండూ వేర్వేరు. రాయలవారి గురించి ఆయన విజయనగర సామ్రాజ్యం గురించి చాలా మందికి తెలిసినా మన ఉత్తరాంధ్రలోని ఉన్న విజయనగరం కోట గురించి పూసపాటి వంశం గురించి మాత్రం స్థానికులను మినహాయించి బయట వారికి చాలా తక్కువ విషయాలే తెలుసని చెప్పాలి. విజయనగం కోటను నిర్మించిన పూసపాటి రాజులది సూర్యవంశం. క్రీస్తు శకం 514 నుంచి 592 వరకు దక్షిణ భారతదేశంలో మాధవ వర్మ నాయకత్వంలో బెజవాడని రాజధానిగా చేసుకుని వీరు రాజ్యాన్ని పరిపాలించారు . మాధవ వర్మకు సంబంధించిన వారే పూసపాటి వంశస్థులు. ఒకప్పుడు విజయనగరం ప్రాంతాన్ని ఉత్తరాంధ్ర ఉత్తర సర్కారు అని కూడా పిలిచేవారు. ఉత్తరఆంధ్ర సర్కార్లను గెలుచుకోవడంలో మొగల్ బాద్షా షేక్ ఖాన్ కు పూసపాటి వారు సహాయం చేశారని చరిత్ర చెబుతోంది.అందుకు బహుమతిగా కుమిలి భోగాపురం ప్రాంతాలను పూసపాటి వారికి మొగల్ చక్రవర్తి బహుమతిగా ఇచ్చారని చెబుతుంటారు. ఆ రోజుల్లో కుమిలిని కుందులాపురం అని పిలిచేవారట. ఆ ప్రాంతంలో పూసపాటివారు మట్టి కోట నిర్మించి రాజ్యాన్ని ప్రారంభించారు అయితే 1686 లో ఔరంగజేబు గోల్కొండపై దండెత్తి కుతుబ్షా వంశాన్ని సర్వం నాశనం చేశాడు. ఈ యుద్ధంలో ఔరంగజేబుకు పూసపాటి రాజా సహాయం చేశారని చెప్పుకుంటారు.అందుకు ఔరంగంగా జేబు జుల్తీకర్ అనే కత్తిని పూసపాటి వారికి బహుమతిగా ఇచ్చారని చరిత్ర చెబుతోంది. వారు వాడే కత్తికి రెండు మొనలు ఉండడం విశేషం. కత్తితోపాటు పూసపాటి వారికి మహారాజా అని పేరును కూడా బహుకరించారు ఔరంగజేబు. 1713 లో ఒక బాబా సలహా మేరకు మొదటి ఆనంద్ రాజు ఈ కోటకి శంకుస్థాపన చేశారు కోట నిర్మించిన నాలుగు సంవత్సరాలకే రాజు మరణించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన పెద్ద విజయరామరాజు ఈ కోట నిర్మాణాన్ని పూర్తి చేశారు. పెద్ద విజయరామరాజు రాజధాని కుమిలి నుంచి మార్చి కళింగ విజయనగరానికి నాంది పలికారని చరిత్ర పరిశోధకులు, ప్రొఫెసర్ రామకృష్ణ చెబుతున్నారు