Vijayawada Traditional Tiffin Point : ఇడ్లీ, దోశ, ఉప్మా బోర్ కొట్టాయా.. ఓసారి ఇటు లుక్కేయండి
మూములుగా మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ అంటే ఏం తింటాం. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇడ్లీ, దోశ, పూరీ, ఉప్మా...వాకే వాకే. టిఫిన్ గా పులిహోర తిన్నావా..పోనీ పూర్ణాలు..కేసరి...అట్లీస్ట్ గారెలు.. అదేంటీ ఏదో పండుగ రోజు వండుకునే ఐటమ్స్ అన్నీ చెబుతున్నావ్..అవన్నీ ఎప్పుడో అకేషనల్ గా తింటుంటాం రోజూ వండుకోవటానికి టైం సరిపోవద్దూ అంటారా. సరిగ్గా ఇదే పాయింట్ తో సక్సెస్ ఫుల్ గా విజయవాడలో ఓ హోటల్ రన్ అవుతోంది. యాక్చువల్లీ ఇదేం హోటల్ కూడా కాదు జస్ట్ కర్రీ పాయింట్ లాంటిది. కానీ ఇక్కడ దొరికే పులిహోర, రవ్వకేసరి, పూర్ణం బూరెలకు క్రేజ్ మాత్రం ఓ రేంజ్ లో ఉంటుంది. ఎక్కడా అంటారా విజయవాడ సత్యనారాయణపురంలో ఉంటుందీ ఈ స్పెషల్ టిఫిన్ పాయింట్.





















