అన్వేషించండి
వంగవీటి రాధాకు 2+2 గన్ మెన్ లు కేటాయించాలని సీఎం జగన్ ఆదేశం
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంత్రి కొడాలి నాని కలిశారు. తనను చంపేందుకు రెక్కీ చేశారంటూ వంగవీటి రాధా చేసిన వ్యాఖ్యల్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. రాధాకు 2+2 గన్ మెన్ ను ఇచ్చి భద్రత కల్పించాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. రాధాపై రెక్కీ నిర్వహించిన వారు ఎవరో దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని డీజీని ఆదేశించారు. రాధా పై ఎవరైనా ఏమైనా చేయాలనుకుంటే ఆ ఆలోచనను ఉపసంహరించుకోవాలని సూచించారు. లేదంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.
వ్యూ మోర్





















