(Source: ECI/ABP News/ABP Majha)
Top 10 Reasons For YS Jagan Defeat | AP Elections 2024 లో జగన్ ఓటమికి పది కారణాలు ఇవే.! | ABP Desam
151 సీట్లు.. చరిత్రలో మరెవ్వరూ సాధించరేమో అన్నంత రీతిలో విజయాన్ని సాధించిన జగన్ మోహనరెడ్డి.. మరోసారి చరిత్ర సృష్టించారు. చరిత్రలో మరెవ్వరూ ఇంతలా ఓటమి చెందరేమో అన్న రీతిలో ఘోర పరాజయం పొందారు. 151 సీట్లు అంటే అది ఆయన విజయం మాత్రమే కాదు.. ఆయనపై జనం పెట్టుకున్న నమ్మకం. మరి నమ్మకం ఏమైంది.. విశ్వాసం ఎందుకు పోయింది. జగన్ కూడా అదే ప్రశ్నించారు. నేను చాలా చేశాను కదా.. నన్ను ఎందుకు నమ్మడం లేదు అని కౌంటింగ్ డే సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి ఆయన బాధపడిపోయారు. ఆయన్ను ఎందుకు నమ్మలేదో మనం చెప్పుకునే ముందు.. ఆయన మాట్లాడారో చూద్దాం. అదీ జగన్ మోహనరెడ్డి బాధ. నేను ఇంత చేశాను నన్ను ఓడించారే.. ఇంత మంచి చేశాను నన్ను మోసం చేశారే అన్నట్లు ఉంది ఆయన బాధ. ఇక జగన్ ఓటమికి కారణం అయిన ఆయన సోషల్ మీడియా అనుచరులైతే.. జనాన్ని మోసం చేసిన నాయకులున్నారు.. కానీ.. జనం చేతిలో మోసపోయిన నాయకుడు జగన్ అంటూ.. ప్రచారం మొదలుపెట్టారు. ఇవే... ఇవే... ఇలాంటివే ఆయన్ను చెడగొట్టాయి. వీటి గురించి మాట్లాడే మందు అసలు జగన్ కోట ఎందుకు బద్దలైంది. దానికి ఎవరు కారణం అనేది చూస్తే.. దానికి ఆయనే కారణం.. ఇంకెవరో కాదు. చాలా కారణాలున్నాయి. ఓ పది చూద్దాం.