MLA Roja: బాగా చదువుకోండి.. జగన్ మామకు మంచి పేరు తీసుకురండి: రోజా
నాడు నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో అత్యాధునిక వసతులు కల్పించిన ముఖ్యమంత్రి జగన్‌కు బాగా చదువుకొని విద్యార్థులు గిఫ్ట్ ఇవ్వాలన్నారు నగరి ఎమ్మెల్యే రోజా. నగరి నియోజకవర్గం ఎగువ కనకంపాళెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన నాడు నేడు ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే రోజా పాల్గొన్నారు. 26.74 లక్షల రూపాయలతో నాడు నేడు మొదటి విడతలో ఆధునీకరించిన జిల్లా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల భవనాన్ని రోజా ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే రోజా విద్యార్థులకు జగనన్న విద్యాకానుక పంపిణీ చేశారు. విద్యార్ధులను ఉద్దేశించి మాట్లాడిన ఆమె.. విద్యార్ధులు బాగా చదివి రాష్ట్రానికి, సీఎంకు పేరు తీసుకురావాలన్నారు. ప్రైవేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను ఆధునీకరించిన సీఎం జగన్ కి రోజా కృతజ్ఞతలు తెలియజేశారు.




















